"దాతారం సర్వసంపదామ్"
శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః | చముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మగళమాతనోతు . రామాయణం మహా మంత్ర మంజూషం. శతకోటి ప్రవిస్తరమైనఈ దివ్యకావ్యం కాలాంతరంలో ఇరవైనాలుగువేల శ్లోకాలకు ఒదిగి మనకు మగహఫలంగా అందింది. ఇందులో ఏ ఒక్క అక్షరం పలికినా సపాపాలను సైతం నశింపచేస్తుంది అని ప్రమాణం. తీరికా, ఓపికా లేని ఈనాటి మనకు 'సూక్ష్మంలో మోక్షం'గా శ్రీరామాయణంలోని పదమసర ప్రథమశతకం సర్వకామ్య సమృద్ధిని అనుగ్రహిస్తుంది - అని మహర్పి వాక్కు. మహామహిమాన్వితమైన అనంత శబ్ద శక్తినీ, శబారపారమ్యాన్ని సంతరించుకున్న శ్రీరామాయణం ఈ భూతలంపై కోట్లాదిమందికి. నిత్యసత్యపారాయణం! శ్రీరామాయణం ఒక అమృత జలధి. భారతీయులకు అదంటే తీరని దాహం. తీరని మమకారం. అక్షర నుడికారం. జీవన సాఫల్యానికి శ్రీకారం.
ఏ శుభ ముహూర్తంలో మహర్షి వాల్మీకి రామకథకు శ్రీకారం చుట్టాడో గానీ, సర్వదేశాలవారికి రామాయణంపై ఎనలేని ప్రేమ, ఆదరం, ఆరాధనాభావం. శ్రీరామాయణం 'ఆదికావ్యం' కాగా, మహర్షి వాల్మీకి 'ఆదికవి' అయినాడు. దాదాపు అన్ని ప్రపంచ భాషలలోనికి శ్రీరామాయణం అనువదించబడింది. తెరలపై నటించబడింది. విచిత్రమేమంటే ఒక్క తమిళంలో మినహాయిస్తే, సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణం, ప్రతి భారతీయ భాషకూ వాల్మీకి భావం, భాష, భావనం హృదయంగమంగా హత్తుకుపోతుంటుంది.
"దాతారం సర్వసంపదామ్" శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః | చముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మగళమాతనోతు . రామాయణం మహా మంత్ర మంజూషం. శతకోటి ప్రవిస్తరమైనఈ దివ్యకావ్యం కాలాంతరంలో ఇరవైనాలుగువేల శ్లోకాలకు ఒదిగి మనకు మగహఫలంగా అందింది. ఇందులో ఏ ఒక్క అక్షరం పలికినా సపాపాలను సైతం నశింపచేస్తుంది అని ప్రమాణం. తీరికా, ఓపికా లేని ఈనాటి మనకు 'సూక్ష్మంలో మోక్షం'గా శ్రీరామాయణంలోని పదమసర ప్రథమశతకం సర్వకామ్య సమృద్ధిని అనుగ్రహిస్తుంది - అని మహర్పి వాక్కు. మహామహిమాన్వితమైన అనంత శబ్ద శక్తినీ, శబారపారమ్యాన్ని సంతరించుకున్న శ్రీరామాయణం ఈ భూతలంపై కోట్లాదిమందికి. నిత్యసత్యపారాయణం! శ్రీరామాయణం ఒక అమృత జలధి. భారతీయులకు అదంటే తీరని దాహం. తీరని మమకారం. అక్షర నుడికారం. జీవన సాఫల్యానికి శ్రీకారం. ఏ శుభ ముహూర్తంలో మహర్షి వాల్మీకి రామకథకు శ్రీకారం చుట్టాడో గానీ, సర్వదేశాలవారికి రామాయణంపై ఎనలేని ప్రేమ, ఆదరం, ఆరాధనాభావం. శ్రీరామాయణం 'ఆదికావ్యం' కాగా, మహర్షి వాల్మీకి 'ఆదికవి' అయినాడు. దాదాపు అన్ని ప్రపంచ భాషలలోనికి శ్రీరామాయణం అనువదించబడింది. తెరలపై నటించబడింది. విచిత్రమేమంటే ఒక్క తమిళంలో మినహాయిస్తే, సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణం, ప్రతి భారతీయ భాషకూ వాల్మీకి భావం, భాష, భావనం హృదయంగమంగా హత్తుకుపోతుంటుంది.
© 2017,www.logili.com All Rights Reserved.