సుందరకాండ
శ్లో|| సున్దరే సున్దరో రామః సున్దరే సుందరీ కథా
సున్దరే సున్దరీసీతా ! సున్దరే సువర్ధం వనం |
సున్దరే సున్దరం కావ్యం సుందరే సుందరః కపిః |
సున్దరే సున్దరం మంత్రం సున్దరే కిం న సున్దరం ||
సుందరకాండమున శ్రీరాముడు సుందరుడు. అందలి కథయు మిక్కిలి సుందరమైనది. సుందరకాండమున సీతయు సుందరి. సుందరకాండము నందలి వనము సుందరమైనది. సుందరకాండము నందలి కావ్యరచనయు సుందరముగా నుండును. సుందరకాండమున హనుమంతుడు సుందరుడు. సుందరకాండమున నందలి మంత్రము సుందరమైనది. వేయేల? సుందరకాండమున సుందరము | కానిదెయ్యది గలదు. అంతయు సుందరమే.
వాల్మీకి మహర్షి అన్ని కాండములకు వానిలో గల యితివృత్తమునకు తగినట్టుగా పేరు పెట్టి యీ కాండమునకు సుందరకాండయని పేరు పెట్టినాడు. దానికి గల కారణమును పై శ్లోకము ఋజువు పరచుచున్నది.
శ్లో|| రామ ఏవపరం బ్రహ్మ రామ ఏవపరం తపః |
రామ ఏవపరం తత్త్వం శ్రీరామోబ్రహ్మతారకం ||
శ్లో|| సప్తకోటి మహామంత్రా: చిత్తవిభ్రమ కారకాః |
ఏక ఏవపరోమంత్రః రామయిత్యక్షర ద్వయం|
అటువంటి రామనామమును తన అణువణువు నాలీనము జేసికొని, తన మనోవాక్కాయ కర్మలను రామనామాంకితము జేసి, రామ నామామృత పానములో | ఓలలాడిన హనుమంతుడే సుందరకాండలో ప్రధాన దైవము. హనుమంతు నుపాసన ఎసిన యెడల సమస్త దేవతలను సేవించిన ఫలము గలుగునని స్మృతులు పేర్కొను చున్నవి. కారణము సమస్త దేవతలలో గల శక్తి ఆయనలో అంతర్లీనమై యుండుటయే.......
సుందరకాండ శ్లో|| సున్దరే సున్దరో రామః సున్దరే సుందరీ కథా సున్దరే సున్దరీసీతా ! సున్దరే సువర్ధం వనం | సున్దరే సున్దరం కావ్యం సుందరే సుందరః కపిః | సున్దరే సున్దరం మంత్రం సున్దరే కిం న సున్దరం || సుందరకాండమున శ్రీరాముడు సుందరుడు. అందలి కథయు మిక్కిలి సుందరమైనది. సుందరకాండమున సీతయు సుందరి. సుందరకాండము నందలి వనము సుందరమైనది. సుందరకాండము నందలి కావ్యరచనయు సుందరముగా నుండును. సుందరకాండమున హనుమంతుడు సుందరుడు. సుందరకాండమున నందలి మంత్రము సుందరమైనది. వేయేల? సుందరకాండమున సుందరము | కానిదెయ్యది గలదు. అంతయు సుందరమే. వాల్మీకి మహర్షి అన్ని కాండములకు వానిలో గల యితివృత్తమునకు తగినట్టుగా పేరు పెట్టి యీ కాండమునకు సుందరకాండయని పేరు పెట్టినాడు. దానికి గల కారణమును పై శ్లోకము ఋజువు పరచుచున్నది. శ్లో|| రామ ఏవపరం బ్రహ్మ రామ ఏవపరం తపః | రామ ఏవపరం తత్త్వం శ్రీరామోబ్రహ్మతారకం ||శ్లో|| సప్తకోటి మహామంత్రా: చిత్తవిభ్రమ కారకాః | ఏక ఏవపరోమంత్రః రామయిత్యక్షర ద్వయం| అటువంటి రామనామమును తన అణువణువు నాలీనము జేసికొని, తన మనోవాక్కాయ కర్మలను రామనామాంకితము జేసి, రామ నామామృత పానములో | ఓలలాడిన హనుమంతుడే సుందరకాండలో ప్రధాన దైవము. హనుమంతు నుపాసన ఎసిన యెడల సమస్త దేవతలను సేవించిన ఫలము గలుగునని స్మృతులు పేర్కొను చున్నవి. కారణము సమస్త దేవతలలో గల శక్తి ఆయనలో అంతర్లీనమై యుండుటయే.......© 2017,www.logili.com All Rights Reserved.