- గడ్డం కోటేశ్వరరావు
హేతుబద్ధ ఆలోచన ద్వారా ప్రజల జీవన సరళిని శాసించే సంబంధాలు, నియమాలను గురించి తెలియని రోజుల్లో పురాణాలు పుట్టాయి. మతాలు, వర్ణాలు, వాటి మూలాలను అవగాహన చేసుకోవడానికి అవసరమైన కనీస తార్కిక భావజాలం ఆనాడు కొరవడింది. అయినప్పటికీ మత సంస్కృతిలోని దోషాలను, వర్ణ వ్యవస్థలోని అసంబద్ధతనూ వేలెత్తి చూపడానికి సాహసించిన వారి నాలుకలు తెగ్గోశారు. రాజ్యాధికారంతోపాటు మతాధిపత్యం చెలాయించిన వర్గాలు సామాజిక పురోగతికి నిరంతరాయంగా అడ్డుకట్టలు వేస్తూనే వచ్చాయి. అందువల్ల నత్తనడకతోనే సమాజం పురోగమించింది. మతం, వర్ణం, పురాణాలు, అందులోని పాత్రలను ఉపయోగించి సామాజిక పురోగతిని తీవ్రంగా అడ్డుకోనంత కాలం ఘర్షణలు పెద్దగా జరగవు. వీటిని ఆధారంగా సమాజాన్ని అందులోని సంస్కృతిని నడిపించాలని ప్రయత్నించినప్పుడే వైరుధ్యాలకూ, ఘర్షణలకూ అవకాశం ఏర్పడి సామాజిక అశాంతి నెలకొంటుంది. ఈ అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేయాలనుకునేవారికి శతావతారాలు పుస్తకం ప్రాథమిక విజ్ఞానాన్ని అందిస్తుంది. - గడ్డం కోటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.