1987లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, స్వాంతంత్ర్య సమర చరిత్రపైన కొన్ని ప్రసంగాలు చేశాను. 1988 లో సంగీత రూపకాన్ని రచించాను. అది కూడా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది. వాటిని విన్నవారనేకులు, స్వాతంత్ర్య సమరచరిత్రను వివరంగా వ్రాయవలసినదిగా నన్ను కోరారు. పుస్తకాన్ని తాము అచ్చు వేయిస్తామనికూడా తెలియజేశారు. అలాంటి వారిలో శ్రీ దాసరి నాగభూషణరావుగారొకరు. కాగా, వారి కోరికను కాదనలేక, వివరించిన చరిత్రను విశాలాంధ్ర ప్రచురణాలయం వారికిచ్చాను.
నా ఈ స్వాతంత్ర్య సమర రచనకు, అనేకమంది పెద్దల రచనలు, తోడ్పడినాయి. వారి రచనలనుండి, అధికార పత్రాలనుండి సేకరించి సమాచారాన్ని పొందుపరచినచోట్ల, ఆయా రచయితల పేర్లను, పుస్తకాల పేర్లను, అధికార పత్రాల వివరాలనుకూడా వివరించాను. ఆ పెద్దలందరికీ నా కృతఙ్ఞతలు.
- ముక్కమాల నాగభూషణం
1987లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, స్వాంతంత్ర్య సమర చరిత్రపైన కొన్ని ప్రసంగాలు చేశాను. 1988 లో సంగీత రూపకాన్ని రచించాను. అది కూడా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది. వాటిని విన్నవారనేకులు, స్వాతంత్ర్య సమరచరిత్రను వివరంగా వ్రాయవలసినదిగా నన్ను కోరారు. పుస్తకాన్ని తాము అచ్చు వేయిస్తామనికూడా తెలియజేశారు. అలాంటి వారిలో శ్రీ దాసరి నాగభూషణరావుగారొకరు. కాగా, వారి కోరికను కాదనలేక, వివరించిన చరిత్రను విశాలాంధ్ర ప్రచురణాలయం వారికిచ్చాను. నా ఈ స్వాతంత్ర్య సమర రచనకు, అనేకమంది పెద్దల రచనలు, తోడ్పడినాయి. వారి రచనలనుండి, అధికార పత్రాలనుండి సేకరించి సమాచారాన్ని పొందుపరచినచోట్ల, ఆయా రచయితల పేర్లను, పుస్తకాల పేర్లను, అధికార పత్రాల వివరాలనుకూడా వివరించాను. ఆ పెద్దలందరికీ నా కృతఙ్ఞతలు. - ముక్కమాల నాగభూషణం© 2017,www.logili.com All Rights Reserved.