శ్రీవిద్యలో మొట్టమొదటి శక్తి మంత్రము శ్రీబాలా మంత్రము. ఈమె మంత్రములు త్ర్యక్షరి, షడక్షరి, నవాక్షరీ, పంచదశాక్షరిగా ఆయా గురుసంప్రదాయ మలు ప్రకారము అనుగ్రహిస్తూ ఉంటారు. ఈమెను ఆరాధించడం వలన సాధకుని చిత్తము శుద్ధిపడి మోక్షమార్గము సులభతరమవుతుంది. ఈమె అనుగ్రహము లేనిదే శివ జ్ఞానము కలగదని శాస్త్రవచనము. ఈమె యంత్ర పూజ వామ మార్గములో చాలా ప్రాశస్త్యము. వామ శాక్తేయులు ఈమెను అర్థరాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుఝాము మూడు గంటల వరకు ఆరాధించడం మనము గమనించవచ్చును. అయితే ప్రస్తుత కాలమాన పరిస్తుతుల దృష్యా వామ మార్గమును అనుసరించుట చాలా కష్టము. అంతేగాక కొన్ని వర్ణముల వారికి వామమార్గము నిషిద్ధము. ఈ విషయములు దృష్టిలో ఉంచుకొని ప్రాతఃకాల పూర్వార్థము, ఉత్తరార్థము, వంచమకారసాధన, శవాసనము మొదలగు విషయములు ఇందు తెలుపబడలేదు. ఈ పుస్తకమునందు శ్రీబాలాపూజను పూర్తిగా దక్షిణాచార సంప్రదాయములో సంకలనం చెయ్యబడినది. వర్ణ భేదములు లేకుండా సాధకులు తమ గురుసంప్రదాయానుసారంగా (గురువు ద్వారా ఉపదేశము పొందినవారు) ఈ పూజావిధానమును అనుసరించవచ్చు. భక్తితో పూజించువారికి ఈ తల్లి పరతత్త్వమును అనుగ్రహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.