శ్రీకాళీ విద్య దశమహావిద్యలలో మొదటివిద్య. అందుకే ఈ విద్యను ఆద్యావిద్య అని కూడా అంటారు. ఈమె ఆరాధన మనకు ఎక్కువగా ఉత్తరభారతదేశం మరియు బంగ్లా రాష్ట్రములో కనిపిస్తుంది. దక్షిణ భారతంలో శ్రీలలితార్చన ఎంత ప్రసిద్ధమో ఉ త్తరభారతంలో శ్రీ కాళీ పూజ అంత ప్రసిద్ధము. శ్రీకాళీ పూజా పద్దతిని తెలుపు తంత్ర గ్రంథములు చాలా కలవు. ఈ పూజా పద్దతి శ్రీకాళీ కల్పతరువులో చాలా విస్తృతంగా తెలుపబడినది. కాళీ ఆరాధన ప్రముఖంగా వామాచారములోనే కలదు. దక్షిణాచార ములో ఈమెను పూజించడం చాలా అరుదు. వామ మార్గంలోనే ఈమె త్వరగా తృప్తి చెంది సిద్దిని కలిగిస్తుందని శాస్త్ర వచనము. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థుతుల దృష్ట్యా వామ మార్గమును అనుసరించుట చాలా కష్టము. అంతేగాక కొన్ని వర్ణముల వారికి వామమార్గము నిషిద్ధము. ఈ విషయములు దృష్టిలో ఉంచుకొని ప్రాతఃకాల పూర్వార్థము, ఉత్తరార్థము, పంచమకారసాధన, శవాసనము మొదలగు విషయములు ఇందు తెలుపబడలేదు.
ఈ పుస్తకమునందు శ్రీకాళీ పూజను పూర్తిగా దక్షిణాచార సంప్రదాయములో సంకలనం చెయ్యబడినది. వర్ణభేదములు లేకుండా సాధకులు తమ గురుసంప్రదా యానుసారంగా (గురువు ద్వారా ఉపదేశము పొందినవారు) ఈ పూజావిధానమును అనుసరించవచ్చు. భక్తితో పూజించువారికి ఈ తల్లి కొంగుబంగారం అనడంలో సందేహం లేదు.