శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవత మెలాగో శ్మచ్చరిత్రకు ఈపరాశరసంహిత అలా శరణ్యమైనది. కావున ప్రతి భక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీగ్రహించాలి. హనుమంతునకు సంబందించిన సర్వయుగాల సమగ్రచరిత్రతో బాటు హనుమత్ సంబందమయిన మంత్రభాగము,తంత్రభాగము, స్తోత్రాలు,జలస్తంభన,అగ్నిసంభన.. వాయుస్తంభనాది విద్యలు, ఒకటననేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి.
దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే.. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీ పరాశరమహర్షి స్వయముగా 'పూజయేత్ పుస్తకం ధన్యః - స మర్యో ముక్తిమాన్ భవేత్' (19 - 57) 'పుస్తకస్యాపి పూజనం - అపమృత్యుం తరిష్యతి' (25-23) అని చెప్పుటవహనుమన్ మంత్రశాస్త్రమైన ఈ పరాశరసంహితా గ్రంథాన్ని పూజించుటకూడా హనుమ దనుగ్రహంచే ముక్తి నీయగలదని తెలుపబడింది.కాబట్టి ప్రతి భక్తుడూ ఈ గ్రంథాన్ని పూజాగృహంలో ఉంచుకొనుట ద్వారా కూడా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చును.
భారతీయ సాహిత్యం ఇప్పటికీ వెలుగుచూడనిది ఎంతో ఉంది. వానిలో వేల సంవత్సరాలు మరుగునపడియున్న పరాశరసంహిత ఒకటి. ప్రతి హనుమద్భక్తుడూ పూనుకొని దీని నింకా ప్రచారంగావించి, హనుమంతుని చరిత్ర విశ్వవ్యాప్తం గావింపవలసిన అవసరం ఉంది. శ్రీ 'పరాశరసంహం సుప్రసిద్ధ వైదిక తంత్ర గ్రంథములలో నగ్రగణ్యమైన' దని 'బ్రహ్మవిద్యాలంకాంతర్క వేదాంత విశారద', మహోపాధ్యాయ శ్రీ ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు పేర్కొన్నారు.
శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవత మెలాగో శ్మచ్చరిత్రకు ఈపరాశరసంహిత అలా శరణ్యమైనది. కావున ప్రతి భక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీగ్రహించాలి. హనుమంతునకు సంబందించిన సర్వయుగాల సమగ్రచరిత్రతో బాటు హనుమత్ సంబందమయిన మంత్రభాగము,తంత్రభాగము, స్తోత్రాలు,జలస్తంభన,అగ్నిసంభన.. వాయుస్తంభనాది విద్యలు, ఒకటననేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి. దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే.. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీ పరాశరమహర్షి స్వయముగా 'పూజయేత్ పుస్తకం ధన్యః - స మర్యో ముక్తిమాన్ భవేత్' (19 - 57) 'పుస్తకస్యాపి పూజనం - అపమృత్యుం తరిష్యతి' (25-23) అని చెప్పుటవహనుమన్ మంత్రశాస్త్రమైన ఈ పరాశరసంహితా గ్రంథాన్ని పూజించుటకూడా హనుమ దనుగ్రహంచే ముక్తి నీయగలదని తెలుపబడింది.కాబట్టి ప్రతి భక్తుడూ ఈ గ్రంథాన్ని పూజాగృహంలో ఉంచుకొనుట ద్వారా కూడా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చును. భారతీయ సాహిత్యం ఇప్పటికీ వెలుగుచూడనిది ఎంతో ఉంది. వానిలో వేల సంవత్సరాలు మరుగునపడియున్న పరాశరసంహిత ఒకటి. ప్రతి హనుమద్భక్తుడూ పూనుకొని దీని నింకా ప్రచారంగావించి, హనుమంతుని చరిత్ర విశ్వవ్యాప్తం గావింపవలసిన అవసరం ఉంది. శ్రీ 'పరాశరసంహం సుప్రసిద్ధ వైదిక తంత్ర గ్రంథములలో నగ్రగణ్యమైన' దని 'బ్రహ్మవిద్యాలంకాంతర్క వేదాంత విశారద', మహోపాధ్యాయ శ్రీ ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు పేర్కొన్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.