ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..
దుష్టశిక్షణ - శిష్టరక్షణార్ధం శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలనెత్తాడు. మానవాళికి నైతికవిలువలు, మానవతాధర్మాలను బోధించటంతోపాటు ధర్మ సంస్థాపన ఈ అవతారాల వెనుకనున్న ఉద్దేశ్యం. కలియుగంలో మానవజాతిని ఉద్దరించటం కోసం భగవానుడు శ్రీమహావిష్ణువు ఈ భూలోకంలో శ్రీవెంకటాద్రి పై అవతరించాడు. ఆకాశరాజపుత్రి, పద్మాలయ అయిన శ్రీ పద్మావతీదేవిని వివాహమాడినాడు. శ్రీహరి శ్రీవైకుంఠం నుండి కదిలి వచ్చినది మొదలు శ్రీ పద్మావతీదేవిని కరగ్రహణం చేసినంతవరకు ఆ కమనీయగాథను సచిత్రంగా సభక్తికంగా చదివి తరించండి.
ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి.. దుష్టశిక్షణ - శిష్టరక్షణార్ధం శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలనెత్తాడు. మానవాళికి నైతికవిలువలు, మానవతాధర్మాలను బోధించటంతోపాటు ధర్మ సంస్థాపన ఈ అవతారాల వెనుకనున్న ఉద్దేశ్యం. కలియుగంలో మానవజాతిని ఉద్దరించటం కోసం భగవానుడు శ్రీమహావిష్ణువు ఈ భూలోకంలో శ్రీవెంకటాద్రి పై అవతరించాడు. ఆకాశరాజపుత్రి, పద్మాలయ అయిన శ్రీ పద్మావతీదేవిని వివాహమాడినాడు. శ్రీహరి శ్రీవైకుంఠం నుండి కదిలి వచ్చినది మొదలు శ్రీ పద్మావతీదేవిని కరగ్రహణం చేసినంతవరకు ఆ కమనీయగాథను సచిత్రంగా సభక్తికంగా చదివి తరించండి.© 2017,www.logili.com All Rights Reserved.