బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ బ్రహ్మ శ్రీ సుందర శివరావు శర్మ, సుశీలమ్మల పుత్రులు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి శిష్యులు. వీరు భారత ఆహార సంస్థలో పనిచేస్తున్నారు. సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాదిమందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరి కుమారుడు శ్రీ చాగంటి షణ్ముఖ చరణ్ శర్మ, కోడలు దివ్య సుమన, కుమార్తె నాగ శ్రీవల్లి, అల్లుడు వంశీకృష్ణ శర్మ. వీరి కుమారుడు మిత్రులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్, శ్రీ గురువాణి సంస్థల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషిచేస్తున్నారు.
కన్నె పిల్లలు రుక్మిణీ కళ్యాణం వినడం చేత యోగ్యుడైన భర్త లభిస్తాడని పరమ ప్రమాణం. ఏ కారణం చేత అయినా వివాహం ఆలస్యమైనా 4, 5 ప్రయత్నాలు చేసినా కలసి రావడం లేదు అంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు. పెద్దలు ఏ మాటా ఊరికే చెప్పరు. దానికి నిజంగా అంత శక్తి ఉంది. అయితే అది కేవలం కన్నె పిల్లలకి వివాహం కొరకు నిర్దేశింపబడిన కథ మాత్రమే కాదు, దానిలో అంతరంగా చాలా గొప్ప రహస్యం ఉంది. రుక్మిణీ కళ్యాణం గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ బ్రహ్మ శ్రీ సుందర శివరావు శర్మ, సుశీలమ్మల పుత్రులు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి శిష్యులు. వీరు భారత ఆహార సంస్థలో పనిచేస్తున్నారు. సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాదిమందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరి కుమారుడు శ్రీ చాగంటి షణ్ముఖ చరణ్ శర్మ, కోడలు దివ్య సుమన, కుమార్తె నాగ శ్రీవల్లి, అల్లుడు వంశీకృష్ణ శర్మ. వీరి కుమారుడు మిత్రులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్, శ్రీ గురువాణి సంస్థల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషిచేస్తున్నారు. కన్నె పిల్లలు రుక్మిణీ కళ్యాణం వినడం చేత యోగ్యుడైన భర్త లభిస్తాడని పరమ ప్రమాణం. ఏ కారణం చేత అయినా వివాహం ఆలస్యమైనా 4, 5 ప్రయత్నాలు చేసినా కలసి రావడం లేదు అంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు. పెద్దలు ఏ మాటా ఊరికే చెప్పరు. దానికి నిజంగా అంత శక్తి ఉంది. అయితే అది కేవలం కన్నె పిల్లలకి వివాహం కొరకు నిర్దేశింపబడిన కథ మాత్రమే కాదు, దానిలో అంతరంగా చాలా గొప్ప రహస్యం ఉంది. రుక్మిణీ కళ్యాణం గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.