సృష్టిలో భగవంతుడు ఎనభైనాలుగు లక్షల జీవరాశులను సృష్టించాడు. వాటిలో ఆలోచనా శక్తిని కేవలం మానవుడికి మాత్రమే ప్రసాదించాడు. బుద్ధి అనే శక్తిని ఇచ్చాడు. ఆ శక్తితో శక్తిమంతుడైన ఆ భగవంతుని అంతట, అన్నిట చూడగలిగే అదృష్టాన్ని సంపాదించుకోవాలి. దానికి వేదంలో చెప్పిన పనులను ఆ విధంగానే చేస్తూ ఉండాలి. అప్పుడే మానవుడు మాధవుడై ఉత్తముడని అనిపించుకుంటాడు. తన శక్తిని అనుసరించి భగవంతుని ఆరాధించి శరణువేడితే మానవుడు తాను చేస్తున్న పనులవలన కలిగే ఫలితాలను అనుభవించగలుగుతాడు.
అయితే ఫలితం కోసం ఎదురు చూడకుండ పనులను చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఫలితం మంచిగా ఉన్నా, లేకపోయినా పట్టించుకోకుండా ఏది వచ్చినా భగవంతుడిచ్చినదని అనుకుంటూ అనుభవించాలి. నోరారా పలకాలి. చెవులారా వినాలి. ఆ విధంగా పలికే భగవన్నామం వలన కలిగే ఆనందాన్ని, అనుభూతిని, అనుభవాన్ని అందరూ అందుకోవాలనే తపనతో కృషి చేయడం వలన ఏర్పడినదే ఈ గ్రంథం.
సృష్టిలో భగవంతుడు ఎనభైనాలుగు లక్షల జీవరాశులను సృష్టించాడు. వాటిలో ఆలోచనా శక్తిని కేవలం మానవుడికి మాత్రమే ప్రసాదించాడు. బుద్ధి అనే శక్తిని ఇచ్చాడు. ఆ శక్తితో శక్తిమంతుడైన ఆ భగవంతుని అంతట, అన్నిట చూడగలిగే అదృష్టాన్ని సంపాదించుకోవాలి. దానికి వేదంలో చెప్పిన పనులను ఆ విధంగానే చేస్తూ ఉండాలి. అప్పుడే మానవుడు మాధవుడై ఉత్తముడని అనిపించుకుంటాడు. తన శక్తిని అనుసరించి భగవంతుని ఆరాధించి శరణువేడితే మానవుడు తాను చేస్తున్న పనులవలన కలిగే ఫలితాలను అనుభవించగలుగుతాడు. అయితే ఫలితం కోసం ఎదురు చూడకుండ పనులను చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఫలితం మంచిగా ఉన్నా, లేకపోయినా పట్టించుకోకుండా ఏది వచ్చినా భగవంతుడిచ్చినదని అనుకుంటూ అనుభవించాలి. నోరారా పలకాలి. చెవులారా వినాలి. ఆ విధంగా పలికే భగవన్నామం వలన కలిగే ఆనందాన్ని, అనుభూతిని, అనుభవాన్ని అందరూ అందుకోవాలనే తపనతో కృషి చేయడం వలన ఏర్పడినదే ఈ గ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.