"సావిత్రీ!"
"యమధర్మరాజా!"
"నీ నిజాయితీకి మెచ్చితిని....
ఏదేని ఒక్క పరమ కోరుకొనుము
ప్రసాదించెదను"
"స్త్రీ విముక్తి ప్రసాదించండి స్వామీ!"
"అహు! అసాధ్యము! అది దక్క వేరొక్క
వరము కోరుకొనుము"
"అయిన పురుషాధిక్యతా నాశనము స్వామీ!"
అబలవని, క్షయరోగివని మిన్నకున్న
పురుషుడినని మరచి నన్నునూ
అవమానపరచుచుంటివా!
అయిననూ నీ సాహనమునకు మెచ్చి
ఒక్క వరమిచ్చెదను. కోరుకొనుము.
అదియునూ స్త్రీ విముక్తి దక్క..."
"యమధర్మరాజా!"
"ఏమి సావిత్రీ!"
"స్త్రీ విముక్తి ప్రసాదించలేని మీకు నేనే ఒక"
వరమిచ్చుచున్నాను. స్వీకరించుడు"
"ఏమిది సావిత్రీ?"
"నా విముక్తి స్వామీ!
నా ప్రాణములే మీకు ప్రసాదించుచున్నాను ..."
- అరణ్య కృష్ణ