ఇది నాలుగవ ముద్రణ. ప్రతీసారి నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దుఃఖాన్ని పెంచుకుంటూ ఉంది. దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను : 'మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు, యౌవన మధుమాసమున్ కుసుమ భారము రాలిపోయె..' ఈ పుస్తకంలో ప్రతీ పేజీ నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్థం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీవనయోగ్యం చేసిన ఓషదులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు చరిత్రగా మిగిలే నిట్టూర్పు.
'ఎలిజీ' అంటే ఆప్త వాక్యం. ఆయా వ్యక్తుల పట్ల నా హృదయ స్పందన. అతి అర్ద్రమైన ఈ స్మృతి కావ్యాన్ని ఎప్పటికప్పుడు నింపుతూ, దీన్ని ఎప్పటికప్పుడు సమీకరిస్తూ కేవలం అభిమానంతో ముద్రించే రచయిత, కవి, అత్యంత ఆప్తులు పెద్దిరెడ్డి గణేష్ గారు.
- గొల్లపూడి మారుతీరావు
ఇది నాలుగవ ముద్రణ. ప్రతీసారి నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దుఃఖాన్ని పెంచుకుంటూ ఉంది. దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను : 'మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు, యౌవన మధుమాసమున్ కుసుమ భారము రాలిపోయె..' ఈ పుస్తకంలో ప్రతీ పేజీ నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్థం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీవనయోగ్యం చేసిన ఓషదులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు చరిత్రగా మిగిలే నిట్టూర్పు. 'ఎలిజీ' అంటే ఆప్త వాక్యం. ఆయా వ్యక్తుల పట్ల నా హృదయ స్పందన. అతి అర్ద్రమైన ఈ స్మృతి కావ్యాన్ని ఎప్పటికప్పుడు నింపుతూ, దీన్ని ఎప్పటికప్పుడు సమీకరిస్తూ కేవలం అభిమానంతో ముద్రించే రచయిత, కవి, అత్యంత ఆప్తులు పెద్దిరెడ్డి గణేష్ గారు. - గొల్లపూడి మారుతీరావు© 2017,www.logili.com All Rights Reserved.