ఒక సామాన్యమైన స్త్రీగా, గ్రుహిణిగా జీవితం ప్రారంభించిన సరస్వతీగోరా త్వరలోనే తాను ఒక అసామాన్యమైన వ్యక్తికి జీవితభాగస్వామినని తెలుసుకున్నారు. అంతే, ఒక రెండవ ఆలోచన లేకుండా జీవిత సత్యాన్వేషణ మార్గంపై ప్రయాణం ప్రారంభించారు. కుటుంబ జీవనంలో కోడలుగా పాతకి, కొత్తకీ మధ్య సమన్వయము చేసుకోవలసి వచ్చింది. గోరా సహచరిగా కొత్తనే స్వీకరించి, సమర్దించుకోవలసి వచ్చింది. సాంప్రదాయాల సముద్రం మధ్య ఒక చిన్న ద్వీపం వలె ఉన్న నాస్తిక జీవిత విధానంలో తమ కుటుంబాన్ని సామాజిక, విప్లవ కృషీవలునిగా మలచుకోవలసి వచ్చింది.
ఆ ప్రయత్నాలు, వాటి పరిణామాల సజీవ గాథ సరస్వతీగోరా జీవితకథ. నిరాశ ఎరుగక, విరామమివ్వక, నిరంతరం సాగిన నూతన సంస్కార చైతన్యస్రవంతి ఆమె జీవితం. నేటి సామాజిక సంక్షుభిత వాతావరణంలో సరస్వతీగోరా జీవితకథ ఒక ఒయాసిస్సు, ఒక ఆశాకిరణం. 2006 ఆగస్టు 19న కన్నుమూసిన సరస్వతి గోరా జీవితం అత్యంత స్పూర్తిదాయకం.
ఒక సామాన్యమైన స్త్రీగా, గ్రుహిణిగా జీవితం ప్రారంభించిన సరస్వతీగోరా త్వరలోనే తాను ఒక అసామాన్యమైన వ్యక్తికి జీవితభాగస్వామినని తెలుసుకున్నారు. అంతే, ఒక రెండవ ఆలోచన లేకుండా జీవిత సత్యాన్వేషణ మార్గంపై ప్రయాణం ప్రారంభించారు. కుటుంబ జీవనంలో కోడలుగా పాతకి, కొత్తకీ మధ్య సమన్వయము చేసుకోవలసి వచ్చింది. గోరా సహచరిగా కొత్తనే స్వీకరించి, సమర్దించుకోవలసి వచ్చింది. సాంప్రదాయాల సముద్రం మధ్య ఒక చిన్న ద్వీపం వలె ఉన్న నాస్తిక జీవిత విధానంలో తమ కుటుంబాన్ని సామాజిక, విప్లవ కృషీవలునిగా మలచుకోవలసి వచ్చింది. ఆ ప్రయత్నాలు, వాటి పరిణామాల సజీవ గాథ సరస్వతీగోరా జీవితకథ. నిరాశ ఎరుగక, విరామమివ్వక, నిరంతరం సాగిన నూతన సంస్కార చైతన్యస్రవంతి ఆమె జీవితం. నేటి సామాజిక సంక్షుభిత వాతావరణంలో సరస్వతీగోరా జీవితకథ ఒక ఒయాసిస్సు, ఒక ఆశాకిరణం. 2006 ఆగస్టు 19న కన్నుమూసిన సరస్వతి గోరా జీవితం అత్యంత స్పూర్తిదాయకం.© 2017,www.logili.com All Rights Reserved.