జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు.
తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామె అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి ప్రయాణం సాగిస్తారు. అదొక నిరంతర సాహస యాత్రలా సాగుతారు. చివరకు జీవితం చిన్నది కాదని భ్రమిస్తారు. కానీ... జీవితం లేత కొమ్మల్ని పట్టుకొని వేలాడే మంచుబిందువు. తప్పని సరిగా తెగిపోయేదే. జారిపోయేదే!
ఒక జీవితం కాలం ఎందుకు బ్రతుకుతున్నామని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకున్నప్పుడు "ప్రేమించేందుకు, ప్రేమను వెతుక్కునేందుకు అని మాత్రమే కాకుండా ప్రేమించబడేందుకు, ప్రేమను పంచేందుకు" అని జవాబు చెప్పుకో గలగాలి.
"ఈ కధా ఇలా సాగుతూనేవుంటుంది.....!"
అంగులూరి అంజనీదేవి
జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామె అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి ప్రయాణం సాగిస్తారు. అదొక నిరంతర సాహస యాత్రలా సాగుతారు. చివరకు జీవితం చిన్నది కాదని భ్రమిస్తారు. కానీ... జీవితం లేత కొమ్మల్ని పట్టుకొని వేలాడే మంచుబిందువు. తప్పని సరిగా తెగిపోయేదే. జారిపోయేదే! ఒక జీవితం కాలం ఎందుకు బ్రతుకుతున్నామని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకున్నప్పుడు "ప్రేమించేందుకు, ప్రేమను వెతుక్కునేందుకు అని మాత్రమే కాకుండా ప్రేమించబడేందుకు, ప్రేమను పంచేందుకు" అని జవాబు చెప్పుకో గలగాలి. "ఈ కధా ఇలా సాగుతూనేవుంటుంది.....!" అంగులూరి అంజనీదేవి© 2017,www.logili.com All Rights Reserved.