బాలూ మీరు మాకు కావాలి, మాకోసం మీరు మళ్లీ రావాలి నన్ను ప్రభావితం చేసిన వారి పరిచయాలు సాధారణంగా వారితోనే నేరుగా మొదలైతే శ్రీ బాలుగారితో నా సాంగత్య మూలం భిన్నమైంది. వారితో నా పరిచయం మొదలుకావడానికి ముందు నేను బాలుగారి తండ్రి స్వర్గీయ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారి అభిమానిని. ఆ తర్వాతనే నాకు బాలుగారితో పరిచయం ఏర్పడింది. నాది, వారిది. నెల్లూరు జిల్లానే అనే విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరులోనే నేను మా మేనమామ వద్ద ఉంది చదువుకునే రోజుల్లోనే, నాలుగో తరగతి, ఐదో తరగతో చదువుతున్నప్పుడు సాంబమూర్తిగారి హరికథలు అంటే చెవికోసుకునే వాడిని. హరిదాసు వస్త్రధారణతో, చేతిలో చిడతల చప్పుడుతో లయబద్దంగా ఆయన పాడుతుంటే నేను పరవశించిపోయేవాడిని. సంగీతంపట్ల నాలో అనురక్తి అంకురించింది. అప్పటినుంచే. స్కూలు అయిపోయిన తర్వాత ట్యూషన్ నెపంతో చండశాసనుడైన మా మేనమామ కనుసన్నల నుంచి ఎలాగోలా బయటపడి.... సాంబమూర్తిగారి హరికథ శ్రోతల్లో ఒకడిగా కూర్చుండిపోయేవాడిని.
సాంబమూరిగారంటే వల్లమాలిన అభిమానం. ఆయన సుస్వర గాత్రం అంటే పులకింత. ఇతిహాసాలకు వ్యాఖ్యానం చేస్తూ... పిట్టకథలు చెబుతూ శ్రావ్యంగా పాడుతుంటే మైమరిచిపోయేవాడిని. ఆయన హరికథలు చెప్పే రోజులలో అక్కడకు వెళ్లి వాలిపోవాల్సిందే. త్యాగరాజు ఆరాధనోత్సవాల సమయంలో సాంబమూర్తిగారి వెంట తిరుగుతూ నగర సంకీర్తనలు విని తరించాల్సిందే. ఆయన ప్రధాన వృత్తి సంగీత కచేరీలు చేయడం. అద్భుతంగా పాడేవారు. అప్పటికి నాకు బాలుగారు తెలియదు.. ఆయన సాంబమూర్తిగారి అబ్బాయి అనీ తెలియదు.
బి.ఎస్.సి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదవడానికి నేను కాకినాడ వెళ్లాను. నా చిన్ననాటి స్నేహితుడు, నెల్లూరు కోమలవిలాస్ హెటల్ వారి అబ్బాయి శంకరనారాయణ అనంతపురంలో ఇంజనీరింగ్ లో చేరాడు. అతనికి బాలు సీనియర్. బాలు మంచి పాటగాడనీ, చదువు మధ్యలో వదిలేసి పాటలు పాడడం కోసం మద్రాసు వెళ్లిపోయాడని అనంతపురం కాలేజీలో చెప్పుకుంటూ ఉండేవారట. సెలవులకు శంకరనారాయణ వచ్చినప్పుడు "మన ఊరువాడే బాలూ... సినిమాల్లో పాడుతున్నాడు" అంటూ కబుర్లు చెప్పేవాడు. బాలు సాంబమూర్తి గారి అబ్బాయని అప్పటికి తెలీదు. మన ఊరికుర్రాడు సినిమాల్లోకి వెళ్లాడు. అనుకొనే వాడినంతే! నా చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరా. కానీ చిన్నప్పటి సంగీతకాంక్ష నన్ను వదల్లేదు. సంగీతమంటే మక్కువ ఉండేది. దీంతో ఖాళీ సమయంలో వీణ నేర్చుకొనే వాడిని. సినీగాయకుల్లో ఘంటసాల అంటే ఇష్టం. ఆ సమయంలో ఆయన సినీసంగీతశిఖరం. అందరు హీరోలకు ఆయనే పాడేవారు. బాలు అప్పుడప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న గాయకుడు. ఆయన పాటలు కూడా వింటూ ఉండేవాడిని. బాలు హీరో కృష్ణకు గొంతు మార్చి 'గుంతలకిడి గుంతలకిడి గుమ... | లాంటి పాటలు పాడుతూ ఉండేవారు. అవి నాకు నచ్చేవి కావు. 'గొంతు బావుంది కానీ ఇలాంటి పాటలెందుకు పాడుతున్నాడబ్బా?' అనుకొనే వాడిని. 'రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా.... ప్రతి రాత్రి వసంత రాత్రి.... ఎన్నాలో వేచిన ఉదయం.... లాంటి పాటలు విన్నంత తర్వాతే బాలు గొంతులోని మాధుర్యం నన్ను ఆకట్టుకుంది. ఇలా కొది కాలం గడిచింది. నేను ప్రభుత్వోద్యోగం వదిలి స్వయంగా 'శాంతా బయోటిక్' స్థాపించిన కాలంలోనే అనుకుంటా..... నాకు, బాలు సాంబమూర్తిగారి అబ్బాయని తెలిసింది. ఆయన్ను ఎప్పుడో ఒకసారి కలవాలనేది నా సంకల్పం. కానీ | నాకున్న హడావిడిలో ప్రత్యేక ప్రయత్నమంటూ ఏమీ చేయలేదు.
శాంతా బయోటెక్ కంపెనీని స్థాపించి -కింద మీదా పడుతున్నప్పుడు అంతటి అవిశ్రాంత పోరాటంలో నాకు సాంత్వన కలిగించినవి సంగీత సాహిత్యాలే. అందులోనే నేను సేద తీరేవాడిని. కాబట్టి ఏ కాస సమయం ! దొరికినా నాకిష్టమైన పాటో, పద్యమో వింటుండేవాడిని. ఆ రసాస్వాదనలో నా ఒత్తిడిని మరిచిపోయేవాడిని.............
బాలూ మీరు మాకు కావాలి, మాకోసం మీరు మళ్లీ రావాలి నన్ను ప్రభావితం చేసిన వారి పరిచయాలు సాధారణంగా వారితోనే నేరుగా మొదలైతే శ్రీ బాలుగారితో నా సాంగత్య మూలం భిన్నమైంది. వారితో నా పరిచయం మొదలుకావడానికి ముందు నేను బాలుగారి తండ్రి స్వర్గీయ శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారి అభిమానిని. ఆ తర్వాతనే నాకు బాలుగారితో పరిచయం ఏర్పడింది. నాది, వారిది. నెల్లూరు జిల్లానే అనే విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరులోనే నేను మా మేనమామ వద్ద ఉంది చదువుకునే రోజుల్లోనే, నాలుగో తరగతి, ఐదో తరగతో చదువుతున్నప్పుడు సాంబమూర్తిగారి హరికథలు అంటే చెవికోసుకునే వాడిని. హరిదాసు వస్త్రధారణతో, చేతిలో చిడతల చప్పుడుతో లయబద్దంగా ఆయన పాడుతుంటే నేను పరవశించిపోయేవాడిని. సంగీతంపట్ల నాలో అనురక్తి అంకురించింది. అప్పటినుంచే. స్కూలు అయిపోయిన తర్వాత ట్యూషన్ నెపంతో చండశాసనుడైన మా మేనమామ కనుసన్నల నుంచి ఎలాగోలా బయటపడి.... సాంబమూర్తిగారి హరికథ శ్రోతల్లో ఒకడిగా కూర్చుండిపోయేవాడిని. సాంబమూరిగారంటే వల్లమాలిన అభిమానం. ఆయన సుస్వర గాత్రం అంటే పులకింత. ఇతిహాసాలకు వ్యాఖ్యానం చేస్తూ... పిట్టకథలు చెబుతూ శ్రావ్యంగా పాడుతుంటే మైమరిచిపోయేవాడిని. ఆయన హరికథలు చెప్పే రోజులలో అక్కడకు వెళ్లి వాలిపోవాల్సిందే. త్యాగరాజు ఆరాధనోత్సవాల సమయంలో సాంబమూర్తిగారి వెంట తిరుగుతూ నగర సంకీర్తనలు విని తరించాల్సిందే. ఆయన ప్రధాన వృత్తి సంగీత కచేరీలు చేయడం. అద్భుతంగా పాడేవారు. అప్పటికి నాకు బాలుగారు తెలియదు.. ఆయన సాంబమూర్తిగారి అబ్బాయి అనీ తెలియదు. బి.ఎస్.సి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదవడానికి నేను కాకినాడ వెళ్లాను. నా చిన్ననాటి స్నేహితుడు, నెల్లూరు కోమలవిలాస్ హెటల్ వారి అబ్బాయి శంకరనారాయణ అనంతపురంలో ఇంజనీరింగ్ లో చేరాడు. అతనికి బాలు సీనియర్. బాలు మంచి పాటగాడనీ, చదువు మధ్యలో వదిలేసి పాటలు పాడడం కోసం మద్రాసు వెళ్లిపోయాడని అనంతపురం కాలేజీలో చెప్పుకుంటూ ఉండేవారట. సెలవులకు శంకరనారాయణ వచ్చినప్పుడు "మన ఊరువాడే బాలూ... సినిమాల్లో పాడుతున్నాడు" అంటూ కబుర్లు చెప్పేవాడు. బాలు సాంబమూర్తి గారి అబ్బాయని అప్పటికి తెలీదు. మన ఊరికుర్రాడు సినిమాల్లోకి వెళ్లాడు. అనుకొనే వాడినంతే! నా చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరా. కానీ చిన్నప్పటి సంగీతకాంక్ష నన్ను వదల్లేదు. సంగీతమంటే మక్కువ ఉండేది. దీంతో ఖాళీ సమయంలో వీణ నేర్చుకొనే వాడిని. సినీగాయకుల్లో ఘంటసాల అంటే ఇష్టం. ఆ సమయంలో ఆయన సినీసంగీతశిఖరం. అందరు హీరోలకు ఆయనే పాడేవారు. బాలు అప్పుడప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న గాయకుడు. ఆయన పాటలు కూడా వింటూ ఉండేవాడిని. బాలు హీరో కృష్ణకు గొంతు మార్చి 'గుంతలకిడి గుంతలకిడి గుమ... | లాంటి పాటలు పాడుతూ ఉండేవారు. అవి నాకు నచ్చేవి కావు. 'గొంతు బావుంది కానీ ఇలాంటి పాటలెందుకు పాడుతున్నాడబ్బా?' అనుకొనే వాడిని. 'రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా.... ప్రతి రాత్రి వసంత రాత్రి.... ఎన్నాలో వేచిన ఉదయం.... లాంటి పాటలు విన్నంత తర్వాతే బాలు గొంతులోని మాధుర్యం నన్ను ఆకట్టుకుంది. ఇలా కొది కాలం గడిచింది. నేను ప్రభుత్వోద్యోగం వదిలి స్వయంగా 'శాంతా బయోటిక్' స్థాపించిన కాలంలోనే అనుకుంటా..... నాకు, బాలు సాంబమూర్తిగారి అబ్బాయని తెలిసింది. ఆయన్ను ఎప్పుడో ఒకసారి కలవాలనేది నా సంకల్పం. కానీ | నాకున్న హడావిడిలో ప్రత్యేక ప్రయత్నమంటూ ఏమీ చేయలేదు. శాంతా బయోటెక్ కంపెనీని స్థాపించి -కింద మీదా పడుతున్నప్పుడు అంతటి అవిశ్రాంత పోరాటంలో నాకు సాంత్వన కలిగించినవి సంగీత సాహిత్యాలే. అందులోనే నేను సేద తీరేవాడిని. కాబట్టి ఏ కాస సమయం ! దొరికినా నాకిష్టమైన పాటో, పద్యమో వింటుండేవాడిని. ఆ రసాస్వాదనలో నా ఒత్తిడిని మరిచిపోయేవాడిని.............© 2017,www.logili.com All Rights Reserved.