పల్లెపాఠాలు
'గింత ధైర్యం ఎక్కడిదిరా'
అన్నాడు మిత్రుడు.
ఉరిమినప్పుడు మాయమ్మ
'అర్జునా ఫల్గుణా' అనమంది అన్నాను.
ఫర్లాంగుల దూరంలో
బావిలో నీళ్లు చేది
బిందెలు మోయటం వల్లనే
బతుకుభారాన్ని నేర్చుకున్నాన్నేను.
ఆనాడు చేతులకు కాసిన కాయలు
ఇప్పుడు పండ్లయినాయి.
పొలంగట్ల మీద బ్యాలెన్సు చేస్తూ
నడవటం మూలాన
నాకు జీవన సంతులనం అలవడ్డది.
తుమ్మముల్లు గుచ్చుకొని
పీకినప్పుడు రక్తం ఉరలింది గాని
బతుకు పూలపాన్పులు కాదని అవగతమైంది.
బతుకమ్మ పూలకోసం
మొదటిసారి శిఖరం గుట్ట ఎక్కాను.
ఎత్తులకెదిగే లాఘవం
అప్పుడే అలవడ్డది.
పక్కింటి జనార్ధన్
ఈత నేర్పినప్పుడు
మొరాయించాను గాని................
© 2017,www.logili.com All Rights Reserved.