అద్భుతం... అమోఘం...! ఈ మాట ఈ పుస్తకంలో ఉన్న కార్టూన్ల గురించి కాదు నేను చెబుతున్నది. అసలు ఇలాంటి పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన 'అద్భుతం... అమోఘం' అని..! కార్టూనిస్టులకి జీవితానికి సరిపడా సంతృప్తిని 'కొంటె బొమ్మల బ్రహ్మలు' పుస్తకరూపంలో ఇచ్చారు. ఈ సేకరణ, శ్రమా సాధారణ విషయం కాదు. ఈ సందర్భంగా కళాసాగర్ నాకన్నా చిన్న వాడైనా నమస్కరిస్తున్నాను.
ఇందులో ఒకటి రెండు కార్టూన్లు మాత్రమే బావున్నాయి. మరో ఒకట్రెండు 'పర్లేదు'గా ఉన్నాయ్. . అంతే..! మిగతావన్నీ అద్భుతం టు ది పవర్ ఆఫ్ అమోఘంగా ఉన్నాయి.
1927లో తలిశెట్టి రామారావుగారు తొలి కార్టూన్ వేశారు కాబట్టి రెండువేల ఇరవైఏడు(2027)కి తెలుగు కార్టూన్ కి వంద సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ హాస్యతోరణ పల్లకీని దాదాపు వందమంది కార్టూనిస్టులు ఇక్కడి వరకూ తీ(మో)సుకువచ్చారు. తెలుగు కార్టూన్ చరిత్రకు దర్పణం ఈ పుస్తకమనడంలో సందేహం లేదు. 166 మంది కార్టూనిస్టుల జీవన రేఖలు, 350 కార్టూన్లతో రూపొందిన ఈ పుస్తకం స్టెస్-బస్టర్. పనివత్తిడిలో రిలాక్స్ అయ్యే సాధనం. కార్టూన్ గీస్తే అభినందన. చూస్తే చిరునవ్వు. ప్రతీ విద్యార్థికి చిన్నప్పుడే కార్టూన్ నేర్పితే, ఆ అభినందన రుచి చూసాక సెల్ ఫోన్ వైపు వెళ్ళడు.
-యండమూరి వీరేంద్రనాథ్ (ముందుమాట)
అద్భుతం... అమోఘం...! ఈ మాట ఈ పుస్తకంలో ఉన్న కార్టూన్ల గురించి కాదు నేను చెబుతున్నది. అసలు ఇలాంటి పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన 'అద్భుతం... అమోఘం' అని..! కార్టూనిస్టులకి జీవితానికి సరిపడా సంతృప్తిని 'కొంటె బొమ్మల బ్రహ్మలు' పుస్తకరూపంలో ఇచ్చారు. ఈ సేకరణ, శ్రమా సాధారణ విషయం కాదు. ఈ సందర్భంగా కళాసాగర్ నాకన్నా చిన్న వాడైనా నమస్కరిస్తున్నాను. ఇందులో ఒకటి రెండు కార్టూన్లు మాత్రమే బావున్నాయి. మరో ఒకట్రెండు 'పర్లేదు'గా ఉన్నాయ్. . అంతే..! మిగతావన్నీ అద్భుతం టు ది పవర్ ఆఫ్ అమోఘంగా ఉన్నాయి. 1927లో తలిశెట్టి రామారావుగారు తొలి కార్టూన్ వేశారు కాబట్టి రెండువేల ఇరవైఏడు(2027)కి తెలుగు కార్టూన్ కి వంద సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ హాస్యతోరణ పల్లకీని దాదాపు వందమంది కార్టూనిస్టులు ఇక్కడి వరకూ తీ(మో)సుకువచ్చారు. తెలుగు కార్టూన్ చరిత్రకు దర్పణం ఈ పుస్తకమనడంలో సందేహం లేదు. 166 మంది కార్టూనిస్టుల జీవన రేఖలు, 350 కార్టూన్లతో రూపొందిన ఈ పుస్తకం స్టెస్-బస్టర్. పనివత్తిడిలో రిలాక్స్ అయ్యే సాధనం. కార్టూన్ గీస్తే అభినందన. చూస్తే చిరునవ్వు. ప్రతీ విద్యార్థికి చిన్నప్పుడే కార్టూన్ నేర్పితే, ఆ అభినందన రుచి చూసాక సెల్ ఫోన్ వైపు వెళ్ళడు. -యండమూరి వీరేంద్రనాథ్ (ముందుమాట)