రాణా ప్రతాప్ సింహుడు సాటిలేని వీరుడు. భారతదేశ చరిత్రలో అంతులేని దేశభక్తికి, త్యాగానికి అతడు గొప్ప ఉదాహరణ. మేవాడ్ కి రాజైనప్పటికినీ అడవులలో, కొండలలో మాతృభూమి విముక్తి కోసం పోరాడి గెలిచిన మహా యోధ. అతని చరిత్ర సువర్ణాక్షరాలతో భారతదేశ చరిత్రలో లిఖించదగినది. అంతటి మహాపురుషుని జీవితం గురించి కొంత తెలుసుకుందాం. రాణా ప్రతాప్ 9, మే నెల 1549 నాడు జన్మించాడు. అతని తండ్రి పేరు మహారాణా ఉదయసింహుడు. అతడు మేవాడ్ కు రాజు. ప్రతాపుని తల్లి పేరు జైవంతాబాయి. ఇతడే ఆ తల్లిదండ్రులకు తొలి సంతానము. పెద్ద కొడుకన్న మాట. ఆ రోజులలో రాజులకు ఎక్కువమంది భార్యలుండేవారు. అదో గొప్ప! ఉదయ సింహుడికి 18 మంది భార్యలుండేవారు. వారికి 24 మంది కుమారులు జన్మించారు. అందరికంటే పెద్దవాడే రాణా ప్రతాపసింహుడు.
రాణా ప్రతాప్ సింహుడు సాటిలేని వీరుడు. భారతదేశ చరిత్రలో అంతులేని దేశభక్తికి, త్యాగానికి అతడు గొప్ప ఉదాహరణ. మేవాడ్ కి రాజైనప్పటికినీ అడవులలో, కొండలలో మాతృభూమి విముక్తి కోసం పోరాడి గెలిచిన మహా యోధ. అతని చరిత్ర సువర్ణాక్షరాలతో భారతదేశ చరిత్రలో లిఖించదగినది. అంతటి మహాపురుషుని జీవితం గురించి కొంత తెలుసుకుందాం. రాణా ప్రతాప్ 9, మే నెల 1549 నాడు జన్మించాడు. అతని తండ్రి పేరు మహారాణా ఉదయసింహుడు. అతడు మేవాడ్ కు రాజు. ప్రతాపుని తల్లి పేరు జైవంతాబాయి. ఇతడే ఆ తల్లిదండ్రులకు తొలి సంతానము. పెద్ద కొడుకన్న మాట. ఆ రోజులలో రాజులకు ఎక్కువమంది భార్యలుండేవారు. అదో గొప్ప! ఉదయ సింహుడికి 18 మంది భార్యలుండేవారు. వారికి 24 మంది కుమారులు జన్మించారు. అందరికంటే పెద్దవాడే రాణా ప్రతాపసింహుడు.© 2017,www.logili.com All Rights Reserved.