బాల సాహిత్యంలో విశేషంగా కృషిచేసిన వీరు, కరీంనగరము జిల్లా చౌలమద్ది గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ, వేంకటయ్య దంపతులకు, 26 జనవరి 1942న జన్మించారు.
వీరు మొత్తం 36 పుస్తకాలను ప్రచురించారు. ఇందులో 26 పుస్తకాలకి పైగా బాలసాహిత్య రచనలే వెలువరించారు. 36 ముద్రిత పుస్తకాలతో పాటు పలు బాలల పత్రికలు బుజ్జాయి, బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, బాలబాట తదితర బాల మాసపత్రికలు మరియు సంకలనాలలో కథలు, బాలల కథలు, పొడుపు కథలు, కవితలు, గేయాలు, గ్రంథ సమీక్షలు, వ్యాసాలు, అనువాదాలు తదితరాలు ప్రచురితమయ్యాయి.
ఆకాశవాణి హైదరాబాద్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్లు కేంద్రాలనుండి కవితలు కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.
బాల సాహిత్యంలో వీరు చేసిన అవిరళ కృషికి, 2017 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు, 'బాల సాహిత్య పురస్కార్ - 2017' వరించింది. 14 నవంబర్ 2017న వీరు ఢిల్లీలో రూ. 50,000/- నగదు పురస్కారంతో సత్కరించబడ్డారు. వీరి సాహితీ సేవకుగాను మరెన్నో పురస్కారాలు గతంలో లభించాయి. అందులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి రాష్ట్రస్థాయి బాల సాహిత్య పురస్కారం 2009లో లభించింది. 2009 నుంచి 'వాసాల నరసయ్య బాల సాహితీ పురస్కారాలు' బాల సాహితీ వేత్తలకు అందజేస్తున్నారు.
బాల సాహిత్యంలో విశేషంగా కృషిచేసిన వీరు, కరీంనగరము జిల్లా చౌలమద్ది గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ, వేంకటయ్య దంపతులకు, 26 జనవరి 1942న జన్మించారు. వీరు మొత్తం 36 పుస్తకాలను ప్రచురించారు. ఇందులో 26 పుస్తకాలకి పైగా బాలసాహిత్య రచనలే వెలువరించారు. 36 ముద్రిత పుస్తకాలతో పాటు పలు బాలల పత్రికలు బుజ్జాయి, బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, బాలబాట తదితర బాల మాసపత్రికలు మరియు సంకలనాలలో కథలు, బాలల కథలు, పొడుపు కథలు, కవితలు, గేయాలు, గ్రంథ సమీక్షలు, వ్యాసాలు, అనువాదాలు తదితరాలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి హైదరాబాద్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్లు కేంద్రాలనుండి కవితలు కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన అవిరళ కృషికి, 2017 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు, 'బాల సాహిత్య పురస్కార్ - 2017' వరించింది. 14 నవంబర్ 2017న వీరు ఢిల్లీలో రూ. 50,000/- నగదు పురస్కారంతో సత్కరించబడ్డారు. వీరి సాహితీ సేవకుగాను మరెన్నో పురస్కారాలు గతంలో లభించాయి. అందులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి రాష్ట్రస్థాయి బాల సాహిత్య పురస్కారం 2009లో లభించింది. 2009 నుంచి 'వాసాల నరసయ్య బాల సాహితీ పురస్కారాలు' బాల సాహితీ వేత్తలకు అందజేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.