మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ గాంధీజీ తన ఆత్మకథని 'సత్యశోధన' అన్నారు. ఆ కథని 1920తో ఆపేశారు. పైపెచ్చు అందులో దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహోద్యమం గురించి రాయలేదు. దాన్ని తానే రాసిన 312 పేజీల 'సత్యాగ్రహ చరిత్ర' గ్రంథంలో చదువుకోమన్నారు. ఇంతవరకు తెలుగులో వెలువడిన గాంధీజీ ఆత్మకథ అనువాదాలలో చాలావాటిలో సత్యాగ్రహోద్యమం ప్రస్తావన లేదు. ఈ పుస్తకంలో సత్యాగ్రహోద్యమం గురించి సంక్షిప్తంగా ఉంది. అందువల్ల గాంధీజీ ఆత్మకథకు సమగ్రత ఏర్పడింది. ఈ పుస్తకంలో 1921 నుంచి 1948 వరకు గాంధీజీ జీవిత కథను జోడించడంతో ఇది గాంధీజీ సమగ్ర జీవిత కథగా రూపుదిద్దుకుంది. అదనంగా ఈ పుస్తకంలో తెలుగు నేలపై గాంధీజీ పర్యటనల విశేషాలు, మహోజ్వలంగా నడిచిన చీరాలపేరాల ఉద్యమం, పల్నాడు పుల్లరి ఉద్యమం, పెదనందిపాడు ఉద్యమం, తదితర వివరాలున్నాయి.
గాంధీజీ మహత్తర జీవితాన్ని అందరూ చదవాలనే సదుద్దేశంతో ఈ డీలక్స్ ఎడిషన్ని లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరకే అందచేస్తున్నాము.
కాటా చంద్రహాస్ పుట్టి పెరిగింది. అనంతపురం జిల్లాలోని రాయంపల్లిలో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటులో ఛీఫ్ కమీషనరుగా ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీరమణ కథలు, చాసో కథలు ఇంగ్లీషులోకి అనువదించారు. ఇంగ్లీషులో వాల్మీకి రామాయణం రాశారు. ఇంగ్లీషులోను, తెలుగులోనూ నాయుడమ్మ జీవిత కథను, యన్.టి.ఆర్. జీవిత కథను (సహరచయిత) రాశారు. ఇన్కమ్ ట్యాక్స్ప ఒక పుస్తకం రాశారు.
మహాత్మా గాంధీ సమగ్ర జీవిత కథ గాంధీజీ తన ఆత్మకథని 'సత్యశోధన' అన్నారు. ఆ కథని 1920తో ఆపేశారు. పైపెచ్చు అందులో దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహోద్యమం గురించి రాయలేదు. దాన్ని తానే రాసిన 312 పేజీల 'సత్యాగ్రహ చరిత్ర' గ్రంథంలో చదువుకోమన్నారు. ఇంతవరకు తెలుగులో వెలువడిన గాంధీజీ ఆత్మకథ అనువాదాలలో చాలావాటిలో సత్యాగ్రహోద్యమం ప్రస్తావన లేదు. ఈ పుస్తకంలో సత్యాగ్రహోద్యమం గురించి సంక్షిప్తంగా ఉంది. అందువల్ల గాంధీజీ ఆత్మకథకు సమగ్రత ఏర్పడింది. ఈ పుస్తకంలో 1921 నుంచి 1948 వరకు గాంధీజీ జీవిత కథను జోడించడంతో ఇది గాంధీజీ సమగ్ర జీవిత కథగా రూపుదిద్దుకుంది. అదనంగా ఈ పుస్తకంలో తెలుగు నేలపై గాంధీజీ పర్యటనల విశేషాలు, మహోజ్వలంగా నడిచిన చీరాలపేరాల ఉద్యమం, పల్నాడు పుల్లరి ఉద్యమం, పెదనందిపాడు ఉద్యమం, తదితర వివరాలున్నాయి. గాంధీజీ మహత్తర జీవితాన్ని అందరూ చదవాలనే సదుద్దేశంతో ఈ డీలక్స్ ఎడిషన్ని లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరకే అందచేస్తున్నాము. కాటా చంద్రహాస్ పుట్టి పెరిగింది. అనంతపురం జిల్లాలోని రాయంపల్లిలో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటులో ఛీఫ్ కమీషనరుగా ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీరమణ కథలు, చాసో కథలు ఇంగ్లీషులోకి అనువదించారు. ఇంగ్లీషులో వాల్మీకి రామాయణం రాశారు. ఇంగ్లీషులోను, తెలుగులోనూ నాయుడమ్మ జీవిత కథను, యన్.టి.ఆర్. జీవిత కథను (సహరచయిత) రాశారు. ఇన్కమ్ ట్యాక్స్ప ఒక పుస్తకం రాశారు.© 2017,www.logili.com All Rights Reserved.