'పుట్టుకతో రైతును, వృత్తిరీత్యా అంటరానివాన్ని' అని తనని తాను సగర్వంగా పరిచయం చేసుకున్న పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ (1922-1985) తన జీవితకాలంలోనే మహనీయుడుగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలోనే ఎన్నో మలుపులను, ఆసక్తికరమైన ఘట్టాలను పొందుపరిచిన పుస్తకం 'ప్రజల శాస్త్రవేత్త'.
సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యం, అట్టడుగు వర్గాల జీవనసరళిని మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాటి ఇంటి ముంగిటకు తీసుకొని వెళ్ళాలన్న ఆదర్శం, ఆచరణలో పెట్టిన సంకల్పసిద్ధి నాయుడమ్మ జీవితంలో స్పష్టంగా చూడవచ్చు. కృషికి తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. ఎదురొచ్చిన అవకాశాల్ని ఎన్నడూ వదులుకోలేదు. ఇన్ని ఉన్నా అదృష్టం కూడా తోడు ఉండాలి కదా. ఉంది కూడా చివరివరకూ. కాకపోతే ఒక క్షణం ఆదమరిచింది. అంతే. కధ ముగుస్తుంది.
- కాటా చంద్రహాస్
'పుట్టుకతో రైతును, వృత్తిరీత్యా అంటరానివాన్ని' అని తనని తాను సగర్వంగా పరిచయం చేసుకున్న పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ (1922-1985) తన జీవితకాలంలోనే మహనీయుడుగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలోనే ఎన్నో మలుపులను, ఆసక్తికరమైన ఘట్టాలను పొందుపరిచిన పుస్తకం 'ప్రజల శాస్త్రవేత్త'. సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యం, అట్టడుగు వర్గాల జీవనసరళిని మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాటి ఇంటి ముంగిటకు తీసుకొని వెళ్ళాలన్న ఆదర్శం, ఆచరణలో పెట్టిన సంకల్పసిద్ధి నాయుడమ్మ జీవితంలో స్పష్టంగా చూడవచ్చు. కృషికి తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. ఎదురొచ్చిన అవకాశాల్ని ఎన్నడూ వదులుకోలేదు. ఇన్ని ఉన్నా అదృష్టం కూడా తోడు ఉండాలి కదా. ఉంది కూడా చివరివరకూ. కాకపోతే ఒక క్షణం ఆదమరిచింది. అంతే. కధ ముగుస్తుంది. - కాటా చంద్రహాస్© 2017,www.logili.com All Rights Reserved.