దాసుగారి స్వీయ చరిత్ర 'నాయెరుక' తెలుగులో రాసిన మొదటి స్వీయ చరిత్ర అని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. ఐతే వీరేశలింగం గారి స్వీయచరిత్ర మొదట వెలువడింది. దాసుగారి స్వీయచరిత్ర ఆంద్రపత్రికలో 1953లో కొంతభాగం, 1955 లో మిగిలిన భాగం ప్రకటితమైంది. 1971 లో మొదటిగా పుస్తకరూపంలో వెలువడింది.
స్వీయచరిత్రలు చారిత్రకంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యం సంతరించుకున్న రచనలు. నా ఎరుక 19వ శతాబ్దం చివరిభాగంలోని దక్షిణ భారతదేశంలోని మత, రాజకీయ, సాంస్కృతిక విషయాలకు ఆటపట్టు. దాసుగారి బాల్య, యౌవనదశల సంధికాలంలో సంప్రదాయంలో వచ్చిన మార్పులను వారి ఆత్మకథగా చక్కగా ప్రతిబింబించింది. బరంపురం మొదలుకొని నాటి కళింగాంధ్రలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటానుభావాలు చాలా విలువైన సమాచారం. బాల్యం నాటి జ్ఞాపకాలను వివరంగా గ్రంథస్తం చేశారు. విజయనగరంలోని విద్యాభ్యాసం నాటి గురువులు, దాసుగారి సహాధ్యాయులు, విజయనగర ఉత్సవాలు, విశాఖపట్టణంలో కాలేజీ చదువు ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
నాయెరుక ఆద్యంతం హాయిగా చదివిస్తుంది. నాటితరం జీవనవిధానం గురించి, ఆనాటి సమాజం గురించి తెలుసుకోవాలంటే ఇటువంటి పుస్తకాల పఠనం ఎంతైనా అవసరం.
- డా డి వి సూర్యారావు
దాసుగారి స్వీయ చరిత్ర 'నాయెరుక' తెలుగులో రాసిన మొదటి స్వీయ చరిత్ర అని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. ఐతే వీరేశలింగం గారి స్వీయచరిత్ర మొదట వెలువడింది. దాసుగారి స్వీయచరిత్ర ఆంద్రపత్రికలో 1953లో కొంతభాగం, 1955 లో మిగిలిన భాగం ప్రకటితమైంది. 1971 లో మొదటిగా పుస్తకరూపంలో వెలువడింది. స్వీయచరిత్రలు చారిత్రకంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యం సంతరించుకున్న రచనలు. నా ఎరుక 19వ శతాబ్దం చివరిభాగంలోని దక్షిణ భారతదేశంలోని మత, రాజకీయ, సాంస్కృతిక విషయాలకు ఆటపట్టు. దాసుగారి బాల్య, యౌవనదశల సంధికాలంలో సంప్రదాయంలో వచ్చిన మార్పులను వారి ఆత్మకథగా చక్కగా ప్రతిబింబించింది. బరంపురం మొదలుకొని నాటి కళింగాంధ్రలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటానుభావాలు చాలా విలువైన సమాచారం. బాల్యం నాటి జ్ఞాపకాలను వివరంగా గ్రంథస్తం చేశారు. విజయనగరంలోని విద్యాభ్యాసం నాటి గురువులు, దాసుగారి సహాధ్యాయులు, విజయనగర ఉత్సవాలు, విశాఖపట్టణంలో కాలేజీ చదువు ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నాయెరుక ఆద్యంతం హాయిగా చదివిస్తుంది. నాటితరం జీవనవిధానం గురించి, ఆనాటి సమాజం గురించి తెలుసుకోవాలంటే ఇటువంటి పుస్తకాల పఠనం ఎంతైనా అవసరం. - డా డి వి సూర్యారావు© 2017,www.logili.com All Rights Reserved.