కమ్యూనిస్టు పార్టీలో సాధారణ కార్యకర్త నుండి నాయకుల వరకు అందరూ "ఎంహెచ్" అని ఆప్యాయంగా పిలుచుకునే మోటూరు జీవితం విప్లవ పోరాటనుభవాల మయం. బాల్యం నుండి జీవిత చరమాంకం వరకు ఎంహెచ్ జీవితంలోని ప్రతిఘట్టం ప్రజా ఉద్యమంలో పనిచేసే నేటితరానికి స్ఫూర్తిదాయకం. మార్క్సిజం లెనినిజం తీర్చిదిద్దిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కష్టజీవుల రాజ్యాన్ని సాధించడానికి సోషలిజం తీసుకురావడానికి ఆజన్మాంతం కృషిచేశారు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు.
ఎంహెచ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ప్రజాశక్తి పత్రిక సంపాదికునిగా బాధ్యతలు నిర్వహించారు. ఒక చేత్తో పార్టీని ప్రజా ఉద్యమాలను మరో చేత్తో పత్రికా వ్యాసంగాన్ని అద్భుతంగా నడిపిన నవ్యసాచి అయన. బహిరంగ సభల్లో అయన గళం రాజకీయ అవకాశవాదాన్ని దుసుమాడేది. పత్రికా రంగంలో అయన కలం ప్రజావ్యతిరేకులను చీల్చి చెండాడేది. ఆయనతో మాట్లాడ్డం పార్టీ కార్యకర్తలకు ఎడ్యుకేషన్. అయన ఆప్యాయత వారికీ ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకం. నా గమ్యం పేరుతో ఎంహెచ్ రాసిన ఈ పుస్తకం అయన విప్లవ పోరాట అనుభవాల సారం.
- మోటూరు హనుమంతరావు