ప్రతివారికీ జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా జీవితంలో కుడా అంతే. అలిపిరిలో ఓ పెద్ద ఘోరం జరిగింది. భగవంతుడు నాకు మరో జన్మను ఇచ్చాడు. అప్పుడే చెప్పాను, నేను దానిని సార్ధకం చేసుకుంటానని. ఇందుకే నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో తెలియదు. కానీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలని రాసిపెట్టి ఉండబట్టే నేను ఆనాడు అంత ప్రమాదం నుండి బ్రతికి బయట పడ్డాను. నాకు చిత్తశుద్ధి ఉంది. నిజాయితీ ఉంది కష్టపడి పనిచేయగలను. అందరి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ వన్ స్థానానికి తీసుకెళతాను. వరల్డ్ క్లాస్ రాజధాని నగరాన్ని నిర్మిస్తాను. అందుకు అన్నివిధాల సన్నాహాలు జరుగుతున్నాయి. అంతిమంగా అందరూ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను.
గతానుభవాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతో గతంలో కంటే ఈసారి వేగంగా అభివృద్ధి సాధిస్తాం. ఇక నుంచి నా మిషన్ ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక మోడల్ స్టేట్ గా, డైనమిక్ హ్యపెని౦గ్ స్టేట్ గా తయారుచేయడం. పేదలకు రైతులకు మేలు చేయడం. అదే సమయంలో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు వేగంగా అమలు చేయడం. ఇదే అభివృద్ధికి నా ద్విముఖ ప్రణాళిక. నీతి నిజాయితీతో కూడిన జీవన విధానం, సుఖంగా, సంతోషంగా జీవించగల సమాజం రాష్ట్రంలో సృష్టించడమే అంతిమంగా నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించగలనన్న నమ్మకం నాకుంది. సాధించి చూపిస్తాను కూడా!
- నారా చంద్రబాబు నాయుడు
పదేళ్ళ తరువాత వెలువడుతున్న ఈ పుస్తకం కేవలం పునర్ ముద్రణ మాత్రం కాదు. ఎందుకంటే, ఈ పదేళ్ళ ఎదురీతను వివరించడానికి దాదాపు 100 పేజీలకు పైగా పుస్తకాన్ని విస్తరించి రాయవలసి వచ్చింది. ముఖ్యమంత్రిగా కొత్త రికార్డు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇవన్నీ కలిపి ఎంత క్లుప్త౦గా రాసినా పుస్తకం 300 పేజీలు దాటిపోయింది. ఆవిధంగా ఈ పుస్తకం కొత్త జీవం పోసుకున్నట్టే!
- ఇనగంటి వెంకట్రావు
ప్రతివారికీ జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా జీవితంలో కుడా అంతే. అలిపిరిలో ఓ పెద్ద ఘోరం జరిగింది. భగవంతుడు నాకు మరో జన్మను ఇచ్చాడు. అప్పుడే చెప్పాను, నేను దానిని సార్ధకం చేసుకుంటానని. ఇందుకే నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో తెలియదు. కానీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలని రాసిపెట్టి ఉండబట్టే నేను ఆనాడు అంత ప్రమాదం నుండి బ్రతికి బయట పడ్డాను. నాకు చిత్తశుద్ధి ఉంది. నిజాయితీ ఉంది కష్టపడి పనిచేయగలను. అందరి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ వన్ స్థానానికి తీసుకెళతాను. వరల్డ్ క్లాస్ రాజధాని నగరాన్ని నిర్మిస్తాను. అందుకు అన్నివిధాల సన్నాహాలు జరుగుతున్నాయి. అంతిమంగా అందరూ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను. గతానుభవాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతో గతంలో కంటే ఈసారి వేగంగా అభివృద్ధి సాధిస్తాం. ఇక నుంచి నా మిషన్ ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక మోడల్ స్టేట్ గా, డైనమిక్ హ్యపెని౦గ్ స్టేట్ గా తయారుచేయడం. పేదలకు రైతులకు మేలు చేయడం. అదే సమయంలో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు వేగంగా అమలు చేయడం. ఇదే అభివృద్ధికి నా ద్విముఖ ప్రణాళిక. నీతి నిజాయితీతో కూడిన జీవన విధానం, సుఖంగా, సంతోషంగా జీవించగల సమాజం రాష్ట్రంలో సృష్టించడమే అంతిమంగా నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించగలనన్న నమ్మకం నాకుంది. సాధించి చూపిస్తాను కూడా! - నారా చంద్రబాబు నాయుడు పదేళ్ళ తరువాత వెలువడుతున్న ఈ పుస్తకం కేవలం పునర్ ముద్రణ మాత్రం కాదు. ఎందుకంటే, ఈ పదేళ్ళ ఎదురీతను వివరించడానికి దాదాపు 100 పేజీలకు పైగా పుస్తకాన్ని విస్తరించి రాయవలసి వచ్చింది. ముఖ్యమంత్రిగా కొత్త రికార్డు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇవన్నీ కలిపి ఎంత క్లుప్త౦గా రాసినా పుస్తకం 300 పేజీలు దాటిపోయింది. ఆవిధంగా ఈ పుస్తకం కొత్త జీవం పోసుకున్నట్టే! - ఇనగంటి వెంకట్రావు© 2017,www.logili.com All Rights Reserved.