తెలుగువాడుగా పుట్టి సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో అత్యున్నత శిఖరాలనధిరోహించిన సవ్యసాచి ఆయన. సహజంగా రాజకీయాలలో మునిగియున్న వారికి ఇతర విషయాల పట్ల శ్రద్ధ వహించటం కష్టం. అందునా లలిత కళల పట్ల శ్రద్ధ చూపటం మరీ కష్టం. దానికి పూర్వ జన్మ సుకృతం ఉండాలి. గొప్ప సంస్కారం ఉండాలి. అందుకు అయన అకుంఠిత దీక్ష, పట్టుదల, నిబద్ధత, జాతీయ భావన, కళల పట్ల మక్కువ, ప్రతిభావ్యుత్పత్తులు ఆయనకున్న సంపదలు.
ఆ కారణం చేత ఆయన కవిగా, రచయితగా రాజకీయ దూరందురుడుగా అద్వితీయమైన పాత్రలను పోషించారు. రాజకీయ బాధ్యలతో తలమునకలై ఉండి కూడా సాహిత్యాది కళల రసజ్ఞతను పదిలంగా కాపాడుకున్నారు. అందుకే ఆయన రాజకీయాలలో ఒక విశిష్ట వ్యక్తిగా గౌరవింపబడ్డారు. అనేక భాషలు నేర్చుకొని బహుభాషావేత్తగా రాణించారు. కొంతకాలం బందరులోని జాతీయ కళాశాలలో తరువాత రవీంద్రుని శాంతి నికేతన్ చదివి తనకు గల సంస్కారాన్ని ఇనుమడింపజేసుకున్నారు.
తెలుగువాడుగా పుట్టి సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో అత్యున్నత శిఖరాలనధిరోహించిన సవ్యసాచి ఆయన. సహజంగా రాజకీయాలలో మునిగియున్న వారికి ఇతర విషయాల పట్ల శ్రద్ధ వహించటం కష్టం. అందునా లలిత కళల పట్ల శ్రద్ధ చూపటం మరీ కష్టం. దానికి పూర్వ జన్మ సుకృతం ఉండాలి. గొప్ప సంస్కారం ఉండాలి. అందుకు అయన అకుంఠిత దీక్ష, పట్టుదల, నిబద్ధత, జాతీయ భావన, కళల పట్ల మక్కువ, ప్రతిభావ్యుత్పత్తులు ఆయనకున్న సంపదలు. ఆ కారణం చేత ఆయన కవిగా, రచయితగా రాజకీయ దూరందురుడుగా అద్వితీయమైన పాత్రలను పోషించారు. రాజకీయ బాధ్యలతో తలమునకలై ఉండి కూడా సాహిత్యాది కళల రసజ్ఞతను పదిలంగా కాపాడుకున్నారు. అందుకే ఆయన రాజకీయాలలో ఒక విశిష్ట వ్యక్తిగా గౌరవింపబడ్డారు. అనేక భాషలు నేర్చుకొని బహుభాషావేత్తగా రాణించారు. కొంతకాలం బందరులోని జాతీయ కళాశాలలో తరువాత రవీంద్రుని శాంతి నికేతన్ చదివి తనకు గల సంస్కారాన్ని ఇనుమడింపజేసుకున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.