సుదూరంగా -ఎం ఎక్కడో, ఏ చెట్టుమీదనో కొమ్మల మధ్య కూర్చుని కోయిల కూస్తుంది. తీయగా... తెయతియ్యగా -
కోయిల ఏ భాషలో కూస్తోంది? పేరు చెప్పలేం కానీ ఆ కూతను మనం పాటగా అనువదించుకుంటాం - ఇది ప్రకృతిలో, మనిషికి ఉన్న అనిర్వచనీయమైన బంధం.
రెక్కలు కూడా అంతే. ఒక శ్వాసగా పాఠకుడిలోకి వచ్చి చేరుతాయి . అనేక భావాలుగా ప్రవహిస్తాయి.
తేలిగ్గా - రెక్కను ఇలా అర్ధం చేసుకోవచ్చు. ఏదైనా ఒక దృశ్యం, లేదా సంఘటన చూస్తున్నపుడు కలిగే తొలి భావం, ఆ తర్వాత వెంటనే స్ఫూరించే మలిభావంలో తేడా ఉంటుంది. తొలి భావం విషయమైతే, మాలిభావం వ్యాఖ్య అదే రెక్క.
-డా|| గుడిసేవ విష్ణు ప్రసాద్.