'ఆధునిక సాహిత్యం పై హేతువాద భావాలు - ప్రభావాలు' అని నేను పరిశోధనకు స్వీకరించిన ఈ అంశం చాలా విస్తృతమైంది. అయినా తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో చోటు చేసుకున్న హేతువాద భావాలను, ఆ ప్రభావంతో వచ్చిన సాహిత్యాన్ని చెప్పటానికి ప్రయత్నించాను. హేతువాదమనేది ఏదో ఒక రోజున పుట్టి పెరిగిన సిద్ధాంతం కాదు. ప్రాచీనకాలం నుండి మానవుడి జిజ్ఞాసతో అది ఎదుగుతూ వస్తున్నది. మానవునిలోని భయం, ప్రకృతి భీబత్సాల పట్ల భీతి, దైవాన్ని సృష్టించినాయి. దైవభావం చాలా బలీనమైనది. మనిషి ఆ భావాల్ని అతిక్రమించి ఆలోచించడానికి భయపడతాడు. మతం - దైవం ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలవి. అనాది మానవుడు దైవాన్ని సృష్టించాడంటుoది హేతువాదం. అందుకే దేవుణ్ణి తనలాగానే భావించాడంటుంది. దేవుడే మానవుణ్ణి సృష్టించాడంటుంది దైవ వాదం. మానవుడు మతం, సంప్రదాయాలకు శృంఖలా బద్ధుడయి మానవత్వాన్ని మరచి ప్రవర్తించడాన్ని హేతువాదం గర్షిస్తుంది.
సాహిత్యానికి సంబంధించినంత వరకు ఆధునిక యుగం అని చెప్పబడే 19వ శతాబ్ద కాలంలో విజ్ఞాన శాస్త్రాభివృద్ది వల్ల ప్రపంచంలో వచ్చిన అనేక మార్పులు సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. శాస్త్రీయ దృష్టితో పలు అంశాలను పరిశీలించడం వల్ల క్రొత్త దారులు, క్రొత్త ప్రక్రియలు సమాజంలో, సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. మన సాహిత్యం, కళలు, సంప్రదాయాలు, ప్రతిబంధకాలను ఛేదించుకుని పునురుజ్జేవనం వైపు సాగాయి. సమాజ సమస్యలను నూతన దృక్పథం నుండి వీక్షించడం జరిగింది. ఈ పుస్తకంలో హేతువాద భావాలున్న అంశాలను మాత్రమే పరిశీలించడం జరిగింది.
- కె.విజయలక్ష్మి
'ఆధునిక సాహిత్యం పై హేతువాద భావాలు - ప్రభావాలు' అని నేను పరిశోధనకు స్వీకరించిన ఈ అంశం చాలా విస్తృతమైంది. అయినా తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో చోటు చేసుకున్న హేతువాద భావాలను, ఆ ప్రభావంతో వచ్చిన సాహిత్యాన్ని చెప్పటానికి ప్రయత్నించాను. హేతువాదమనేది ఏదో ఒక రోజున పుట్టి పెరిగిన సిద్ధాంతం కాదు. ప్రాచీనకాలం నుండి మానవుడి జిజ్ఞాసతో అది ఎదుగుతూ వస్తున్నది. మానవునిలోని భయం, ప్రకృతి భీబత్సాల పట్ల భీతి, దైవాన్ని సృష్టించినాయి. దైవభావం చాలా బలీనమైనది. మనిషి ఆ భావాల్ని అతిక్రమించి ఆలోచించడానికి భయపడతాడు. మతం - దైవం ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలవి. అనాది మానవుడు దైవాన్ని సృష్టించాడంటుoది హేతువాదం. అందుకే దేవుణ్ణి తనలాగానే భావించాడంటుంది. దేవుడే మానవుణ్ణి సృష్టించాడంటుంది దైవ వాదం. మానవుడు మతం, సంప్రదాయాలకు శృంఖలా బద్ధుడయి మానవత్వాన్ని మరచి ప్రవర్తించడాన్ని హేతువాదం గర్షిస్తుంది. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఆధునిక యుగం అని చెప్పబడే 19వ శతాబ్ద కాలంలో విజ్ఞాన శాస్త్రాభివృద్ది వల్ల ప్రపంచంలో వచ్చిన అనేక మార్పులు సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. శాస్త్రీయ దృష్టితో పలు అంశాలను పరిశీలించడం వల్ల క్రొత్త దారులు, క్రొత్త ప్రక్రియలు సమాజంలో, సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. మన సాహిత్యం, కళలు, సంప్రదాయాలు, ప్రతిబంధకాలను ఛేదించుకుని పునురుజ్జేవనం వైపు సాగాయి. సమాజ సమస్యలను నూతన దృక్పథం నుండి వీక్షించడం జరిగింది. ఈ పుస్తకంలో హేతువాద భావాలున్న అంశాలను మాత్రమే పరిశీలించడం జరిగింది. - కె.విజయలక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.