"మెర్ మేయిడ్లు... సాగరకన్యలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా అనేకమంది చెబుతూ వస్తోన్న విషయం అబద్ధం కాదు. అందులో అసత్యం ఏమాత్రం లేదు. మెర్ మెయిడ్లు ఉన్నాయి. అయితే వాటిని చూసిన వారు ఎక్కువ మంది లేరు. వారు తెలిపిన విషయాలను నిజంగా చూడని వారు కూడా చెబుతూ రావడంతో మెర్ మెయిడ్లు ఉన్నాయనే నగ్నసత్యం అబద్ధంగా మారిపోయింది. చరిత్రలో పురాతన కాలంలో కొందరు మెర్ మెయిడ్లు చూశారు. అయితే సంచలనం కోసమో, పేరు కోసమో నిజంగా మెర్ మెయిడ్లు చూసిన వారు చెప్పినదాన్ని, చూడనివారు వల్లె వేస్తూ వచ్చి దీనిపై అనేక సందేహాలు పుట్టుకొచ్చేలా చేశారు.
మెర్ మెయిడ్లు అనేవి సగం మానవాకృతి, సగం చేపను పోలిన జీవులు. అవి తల నుండి నడుం వరకు అచ్చు మామూలు స్త్రీలాగా ఉంటే నడుం దిగువ భాగం నుండి మాత్రం చేపను పోలి ఉంటాయి. కాళ్ళకు బదులు తెడ్డులాగాను, తోకలాగాను ఉండే భాగం ఉంటుంది. దాని సాయంతో మెర్ మెయిడ్లు ఎంత దూరమైనా ఈదుతూ సాగిపోతాయి. ఆ వేగం ఊహించతరం కాదు. అలాగే మెర్ మెయిడ్లు... సాగరకన్యలు ఎంతో అందమైనవి. వాటి కురులు నల్లగా నిగనిగ మెరుస్తూ ఎంతో అందంగా ఉంటాయి. వాటిని చూసిన మామూలు మనుషులు ఆశ్చర్యం, భయంతో, షాక్ తో మాట రాకుండా ఉండిపోతే అవి అక్కడి నుండి నీట్లోకి దూసుకుపోతాయి. అవి మాట్లాడినట్లు గానీ, మామూలు మనుషులతో సంబంధాలు పెట్టుకునట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు'. ఈ మెర్ మెయిడ్లు గురించి అన్ని విషయాలు తెలుసుకున్న దీక్ష, అక్షాజ్ అన్వేషణకి బయలుదేరారు. వారి అన్వేషణ ఫలించిందా! లేదా! చదివి తెలుసుకొనండి...
- కోగంటి విజయలక్ష్మి
"మెర్ మేయిడ్లు... సాగరకన్యలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా అనేకమంది చెబుతూ వస్తోన్న విషయం అబద్ధం కాదు. అందులో అసత్యం ఏమాత్రం లేదు. మెర్ మెయిడ్లు ఉన్నాయి. అయితే వాటిని చూసిన వారు ఎక్కువ మంది లేరు. వారు తెలిపిన విషయాలను నిజంగా చూడని వారు కూడా చెబుతూ రావడంతో మెర్ మెయిడ్లు ఉన్నాయనే నగ్నసత్యం అబద్ధంగా మారిపోయింది. చరిత్రలో పురాతన కాలంలో కొందరు మెర్ మెయిడ్లు చూశారు. అయితే సంచలనం కోసమో, పేరు కోసమో నిజంగా మెర్ మెయిడ్లు చూసిన వారు చెప్పినదాన్ని, చూడనివారు వల్లె వేస్తూ వచ్చి దీనిపై అనేక సందేహాలు పుట్టుకొచ్చేలా చేశారు. మెర్ మెయిడ్లు అనేవి సగం మానవాకృతి, సగం చేపను పోలిన జీవులు. అవి తల నుండి నడుం వరకు అచ్చు మామూలు స్త్రీలాగా ఉంటే నడుం దిగువ భాగం నుండి మాత్రం చేపను పోలి ఉంటాయి. కాళ్ళకు బదులు తెడ్డులాగాను, తోకలాగాను ఉండే భాగం ఉంటుంది. దాని సాయంతో మెర్ మెయిడ్లు ఎంత దూరమైనా ఈదుతూ సాగిపోతాయి. ఆ వేగం ఊహించతరం కాదు. అలాగే మెర్ మెయిడ్లు... సాగరకన్యలు ఎంతో అందమైనవి. వాటి కురులు నల్లగా నిగనిగ మెరుస్తూ ఎంతో అందంగా ఉంటాయి. వాటిని చూసిన మామూలు మనుషులు ఆశ్చర్యం, భయంతో, షాక్ తో మాట రాకుండా ఉండిపోతే అవి అక్కడి నుండి నీట్లోకి దూసుకుపోతాయి. అవి మాట్లాడినట్లు గానీ, మామూలు మనుషులతో సంబంధాలు పెట్టుకునట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు'. ఈ మెర్ మెయిడ్లు గురించి అన్ని విషయాలు తెలుసుకున్న దీక్ష, అక్షాజ్ అన్వేషణకి బయలుదేరారు. వారి అన్వేషణ ఫలించిందా! లేదా! చదివి తెలుసుకొనండి... - కోగంటి విజయలక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.