Stephen Hawking

By S Venkata Rao (Author)
Rs.70
Rs.70

Stephen Hawking
INR
PRAJASH366
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             కదిలే కుర్చీలో, కదలని కండరాలతో కాలం కథ చెప్తూ, కాల బిలాలను (చీకటి బిలాలు), పిల్ల విశ్వాలనూ అన్వేషిస్తూ, మహా రూపకల్పన కావిస్తూ, స్థల - కాలాలకు ఆరంభం, అంతం ఉండవని శాస్త్రీయ ప్రతిపాదన చేసి, అంతు బట్టని విశ్వం అంతు చూడాలని కడదాకా శోధన చేసిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ హాకింగ్. ఆయన జీవిత విశేషాలను, పరిశోధనలను సమకాలీన ఖగోళ శాస్త్ర విషయాలను శాస్త్రీయ దృక్పథంతో చక్కగా కూర్చిన అపురూప రచనా శిల్ప, ప్రముఖ పాత్రికేయులు, నా చిరకాల మిత్రుడు ఎస్. వెంకట్రావు గారిని ప్రత్యేకంగా అభినందించాలి.

               ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం, అద్భుతమైన విషయాలను ఎన్నింటినో చెప్తూ మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. నేడు ఖగోళ శాస్త్రం దిగ్భ్రాంతి కొలిపే వేగంతో అనేక నూతన పరికరాలు, పద్ధతుల ద్వారా భారీ పరిమాణంలో సమాచారాన్ని సేకరిస్తోంది. నాలుగువందల ఏళ్ళనాడు గెలీలియో ప్రారంభించిన శాస్త్రీయ విప్లవాన్ని న్యూటన్ ముందుకు తీసుకెళ్ళాడు. ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, స్థల - కాలాలు వంగి ఉంటాయని సమకాలీన సమాజం గుర్తించినప్పటికీ, ఐన్ స్టీన్ పరిశోధన కొనసాగింపుగా స్థలం - కాలం, ద్రవ్యరాశీ శక్తి విశ్వరూపం, కృష్ణ బిలాలు, విశ్వం భవిష్యత్తు వంటి అనేక అంశాల పై సామాన్య ప్రజానీకానికి అర్ధమయ్యేరీతిలో గణిత సూత్రాలను అత్యల్పంగా వాడుతూ, సృజనాత్మక ఆలోచన ద్వారా కొత్తవి, మౌలికమైన భావాలను స్టీఫెన్ హాకింగ్ తన పరిశోధనల ద్వారా ప్రతిపందించాడు. ఆ పరిశోధనలను జనం భాషలో రచించిన రచయిత వెంకట్రావు గారికి అభినందనలు తెలుపవలసిందే. 

                                                                                                                                                                                                                                                - ఎస్. వెంకట్రావు 

             కదిలే కుర్చీలో, కదలని కండరాలతో కాలం కథ చెప్తూ, కాల బిలాలను (చీకటి బిలాలు), పిల్ల విశ్వాలనూ అన్వేషిస్తూ, మహా రూపకల్పన కావిస్తూ, స్థల - కాలాలకు ఆరంభం, అంతం ఉండవని శాస్త్రీయ ప్రతిపాదన చేసి, అంతు బట్టని విశ్వం అంతు చూడాలని కడదాకా శోధన చేసిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ హాకింగ్. ఆయన జీవిత విశేషాలను, పరిశోధనలను సమకాలీన ఖగోళ శాస్త్ర విషయాలను శాస్త్రీయ దృక్పథంతో చక్కగా కూర్చిన అపురూప రచనా శిల్ప, ప్రముఖ పాత్రికేయులు, నా చిరకాల మిత్రుడు ఎస్. వెంకట్రావు గారిని ప్రత్యేకంగా అభినందించాలి.                ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం, అద్భుతమైన విషయాలను ఎన్నింటినో చెప్తూ మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. నేడు ఖగోళ శాస్త్రం దిగ్భ్రాంతి కొలిపే వేగంతో అనేక నూతన పరికరాలు, పద్ధతుల ద్వారా భారీ పరిమాణంలో సమాచారాన్ని సేకరిస్తోంది. నాలుగువందల ఏళ్ళనాడు గెలీలియో ప్రారంభించిన శాస్త్రీయ విప్లవాన్ని న్యూటన్ ముందుకు తీసుకెళ్ళాడు. ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, స్థల - కాలాలు వంగి ఉంటాయని సమకాలీన సమాజం గుర్తించినప్పటికీ, ఐన్ స్టీన్ పరిశోధన కొనసాగింపుగా స్థలం - కాలం, ద్రవ్యరాశీ శక్తి విశ్వరూపం, కృష్ణ బిలాలు, విశ్వం భవిష్యత్తు వంటి అనేక అంశాల పై సామాన్య ప్రజానీకానికి అర్ధమయ్యేరీతిలో గణిత సూత్రాలను అత్యల్పంగా వాడుతూ, సృజనాత్మక ఆలోచన ద్వారా కొత్తవి, మౌలికమైన భావాలను స్టీఫెన్ హాకింగ్ తన పరిశోధనల ద్వారా ప్రతిపందించాడు. ఆ పరిశోధనలను జనం భాషలో రచించిన రచయిత వెంకట్రావు గారికి అభినందనలు తెలుపవలసిందే.                                                                                                                                                                                                                                                  - ఎస్. వెంకట్రావు 

Features

  • : Stephen Hawking
  • : S Venkata Rao
  • : Prajashakti Book House
  • : PRAJASH366
  • : Paperback
  • : 2019
  • : 87
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Stephen Hawking

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam