సైన్సు మానవ సమాజపు ఉత్పత్తి. దానర్థం సైన్సుకు స్వంత వ్యక్తిత్వం లేదని కాదు. సైన్సును అది అభివృద్ధి చెందిన సామాజిక, చారిత్రక స్థితిలోనే సరిగ్గా అర్ధం చేసుకోగలం.
సుమారు 500 కోట్ల సంవత్సరాలు భూగోళపు చరిత్రలో జీవరాశి ఆవిర్భవించింది 200 కోట్ల సంవత్సరాల పూర్వమే. జీవ పరిణామంలో ఉన్నతమైన వానరాలు ఆవిర్భవించి 2 కోట్ల సంవత్సరాలు అయింది. మనుగడ కోసం జరిగిన పోరాటంలో తొలిసారి పనిముట్లు పట్టిన వానరాలే తరువాత మానవులుగా పరిణామం చెందాయి.
పనిముట్లతో ప్రకృతినుండి జీవనావసరాలను సంపాదించుకోడానికి మనిషి చేసిన ప్రయత్నం నుండి సైన్స్ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు సమాజంతో బాటే సైన్స్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అదే సమయంలో సామాజికాభివృద్ధికీ సైన్స్ తోడ్పడింది. సమాజానికీ, సైన్స్కు ఉన్న ఈ అవినాభావ సంబంధం మానవాళి చరిత్ర అంతటా మనకు కనిపిస్తుంది.
మనిషి ఆహార సంపాదనకోసం క్రమంగా పనిముట్లు, నైపుణ్యం పెంచుకుంటూ పోయాడు. కొత్త కొత్త ప్రకృతి వనరులను వినియోగంలోకి తెచ్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రాకృతిక ఘటనలపై అనేక ఊహాజనిత కథలు అల్లుకున్నాడు. ఆ క్రమంలోనే సైన్సు అభివృద్ధి చెందింది. తొలి రాతి బల్లెం భౌతిక శాస్త్రానికి పునాది వేసింది. కందమూలాల కోసం మొక్కల పరిశీలన వృక్షశాస్త్రానికీ, జంతువులను వేటాడే క్రమంలో వాటి పరిశీలన, పెంపకం జంతుశాస్త్రానికీ, మాంసాన్ని కాల్చుకు తినడం, నీళ్లు కాగబెట్టడం రసాయన శాస్త్రానికి పునాదులు వేశాయి....................
సైన్సు - సమాజం - ఎస్. వెంకట్రావు 'ప్రపంచపు (విశ్వం యొక్క) అంతర్గత నిర్మాణాన్ని కనుగొనే విధానమే సైన్సు' అని నిర్వచించాడు బ్రిటిష్ వర్కర్స్ పార్టీ నాయకుడు ఫిల్ గాస్పర్ తను రాసిన 'మార్క్సిజం-సైన్సు' అన్న పుస్తకంలో, సైన్సు మానవ సమాజపు ఉత్పత్తి. దానర్థం సైన్సుకు స్వంత వ్యక్తిత్వం లేదని కాదు. సైన్సును అది అభివృద్ధి చెందిన సామాజిక, చారిత్రక స్థితిలోనే సరిగ్గా అర్ధం చేసుకోగలం. సుమారు 500 కోట్ల సంవత్సరాలు భూగోళపు చరిత్రలో జీవరాశి ఆవిర్భవించింది 200 కోట్ల సంవత్సరాల పూర్వమే. జీవ పరిణామంలో ఉన్నతమైన వానరాలు ఆవిర్భవించి 2 కోట్ల సంవత్సరాలు అయింది. మనుగడ కోసం జరిగిన పోరాటంలో తొలిసారి పనిముట్లు పట్టిన వానరాలే తరువాత మానవులుగా పరిణామం చెందాయి. పనిముట్లతో ప్రకృతినుండి జీవనావసరాలను సంపాదించుకోడానికి మనిషి చేసిన ప్రయత్నం నుండి సైన్స్ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు సమాజంతో బాటే సైన్స్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అదే సమయంలో సామాజికాభివృద్ధికీ సైన్స్ తోడ్పడింది. సమాజానికీ, సైన్స్కు ఉన్న ఈ అవినాభావ సంబంధం మానవాళి చరిత్ర అంతటా మనకు కనిపిస్తుంది. మనిషి ఆహార సంపాదనకోసం క్రమంగా పనిముట్లు, నైపుణ్యం పెంచుకుంటూ పోయాడు. కొత్త కొత్త ప్రకృతి వనరులను వినియోగంలోకి తెచ్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రాకృతిక ఘటనలపై అనేక ఊహాజనిత కథలు అల్లుకున్నాడు. ఆ క్రమంలోనే సైన్సు అభివృద్ధి చెందింది. తొలి రాతి బల్లెం భౌతిక శాస్త్రానికి పునాది వేసింది. కందమూలాల కోసం మొక్కల పరిశీలన వృక్షశాస్త్రానికీ, జంతువులను వేటాడే క్రమంలో వాటి పరిశీలన, పెంపకం జంతుశాస్త్రానికీ, మాంసాన్ని కాల్చుకు తినడం, నీళ్లు కాగబెట్టడం రసాయన శాస్త్రానికి పునాదులు వేశాయి....................© 2017,www.logili.com All Rights Reserved.