కైఫీ అజ్మీ పేరు వినని కవిత్వాభిమానాలూ, సాహిత్యాభిమానులూ, సామాజిక ఉద్యమకారులూ దాదాపుగా ఉండరు. 1940 ల చివరి నుంచి దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఉర్దూ కవిత్వ లోకంలో ధ్రువతారలా వెలిగినవాడాయన. స్వతంత్రంగానూ సినిమారంగం కోసమూ అద్భుతమైన ప్రేమకవిత్వమూ విప్లవకవిత్వమూ రాయడం మాత్రమే కాదు, జీవితంలో అత్యధిక భాగం కమ్యూనిస్టు కార్యకర్తగా బతికాడు కైఫీ. ఉత్తరప్రదేశ్ లోని జమీందార్ కుటుంబం నుంచి వచ్చినవాడైనా, అదంతా వదులుకుని 1950ల్లో కమ్యూనిస్టు పార్టీ బొంబాయిలో నడుపుతుండిన కమ్యూన్ లో ఉంటూ పూర్తికాలం కార్యకర్తగా కార్మికోద్యమంలో పనిచేశాడు. పార్టీ పత్రికలకు రచనలు చేశాడు.
హైదరాబాద్ లో 1947 లో జరిగిన ఒక అభ్యుదయ రచయితల ముషాయిరాకు వచ్చి, హైదరాబాదీ యువతి, నిజాం ప్రభుత్వ ఉన్నతోద్యోగి బిడ్డ షౌకత్ ప్రేమలో చిక్కుకున్నాడు. సహచరిగా షౌకత్ ను కమ్యూన్ లోకీ, ప్రగతిశీల భావలలోకీ నడిపించాడు. ఆమె అసాధారణ రంగస్థల నటిగా, సినిమా నటిగా మారడానికి సహకరించాడు. ఆ ఇద్దరూ కలిసి కూతురు షబానాను అపురూప నటిగా, సామాజిక కార్యకర్తగా, కొడుకు బాబా ఆజ్మీని విశిష్ట సినిమాటోగ్రాఫర్ గా తీర్చిదిద్దారు. అలా ఎన్నెన్నో వ్యక్తిగత, సామూహిక, రాజకీయ అస్తిత్వాలు కలగలిసిన కైఫీ ఆజీ గురించీ, షౌకత్ ఆజ్మీ గురించీ, 1950 ల నుంచి 2002 దాకా జరిగిన అర్ధశతాబ్ది సామాజిక జీవితం గురించీ, ప్రజాకళ గురించీ సాధికారికమైన, ఆత్మీయమైన జ్ఞాపకాల గుచ్చం ఇది.