బతుకు పాఠాలు
కొండవీటి మధుసూదన్ రెడ్డి నాకు చిరకాల ఆప్తుడు. ఎన్నెన్నో ఉత్సాహోద్వేగాలలో, దిక్కుతోచని కష్టాలలో సహచరుడు.
స్వయంగా ప్రగతిశీల ఉద్యమంలో క్రియాశీలియై నడిచినవాడు. బతుకుపోరు మొదటి మెట్టుగా జర్నలిజం సుఖదుఃఖాలు చవిజూచినవాడు. చిరకాలంగా విద్యారంగంలో నిమగ్నుడు. మంచి చదువరి, ఉపాధ్యాయుడు. మంచి మనిషి,
ఈ పుస్తకంలోని రచనలన్నీ మధుసూదన్ రెడ్డి అనుభవ పాఠాలు. ఇందులో కొన్ని సరదాగా చదివించే కథలు. మరికొన్ని సీరియస్ గా ఆలోచింపజేసే వ్యాసాలు. మరికొన్ని రచయిత నేరుగా ముందుకొచ్చి తన అనుభవమే చెప్పి... ఇది మంచి, ఇది చెడు అని చెప్పే మాటలు. ఒక్కోసారి ఒకే రచనలో నాలుగైదు కథల వంటి దృష్టాంతాలుంటాయి. అన్నీ చదువరికి కొన్ని మంచి మాటలు చెబుదామని చేసిన ప్రయత్నాలే. కథలైనా, వ్యాసాలైనా, అనుభవ నివేదనలైనా జీవన విలువల గురించి మంచి, సెబ్బరలు చెప్పడమే ఈ రచనలన్నిటి ఉద్దేశం.
పనిలో పనిగా ఇవాళ క్రమంగా కనుమరుగవుతున్న ఒక ప్రాంత జీవితాన్ని ఈ రచనలు రికార్డు చేస్తాయి. పాత నడతల స్థానంలో వొస్తున్న కొత్త పోకడలను ప్రస్తావిస్తాయి. అందులో మంచిచెడుల చర్చ చేస్తాయి. ఊరిలో దొంగతనం జరిగితే, అనుమానితులను కొట్టడం తప్పంటూనే, వంగబెట్టి బండలెత్తడం వంటి క్రూర గతావశేషాలను ఇంకా ఉన్నట్లు చెప్పకుండా వొదల్లేదు రచయిత.
అదే సమయంలో, దేన్నీ ఊరక సమాచారం కోసం సమాచారం అన్నట్టు చెప్పలేదు. 'ఫ్యాక్ట్'తో పాటు తన 'కామెంటు' కూడా ఉంటుంది. బతుకు నీతిని, స్థానిక సంస్కృతిని పదుగురికి పరిచయం చేసే ప్రయత్నం ప్రతి రచనలో... ఒక సారి నేరుగా మరోసారి సూచనగా... కనిపిస్తాయి. అది కూడా పీఠం వేసుక్కూర్చున్న పీఠాధిపతిలా, మైకు పుచ్చుకుని నిలబడిన రాజకీయ నేతలా కాకుండా ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రేమగా చదువు చెప్పే టీచరు హితవచనాల్లో ఉంటాయి................
బతుకు పాఠాలు కొండవీటి మధుసూదన్ రెడ్డి నాకు చిరకాల ఆప్తుడు. ఎన్నెన్నో ఉత్సాహోద్వేగాలలో, దిక్కుతోచని కష్టాలలో సహచరుడు. స్వయంగా ప్రగతిశీల ఉద్యమంలో క్రియాశీలియై నడిచినవాడు. బతుకుపోరు మొదటి మెట్టుగా జర్నలిజం సుఖదుఃఖాలు చవిజూచినవాడు. చిరకాలంగా విద్యారంగంలో నిమగ్నుడు. మంచి చదువరి, ఉపాధ్యాయుడు. మంచి మనిషి, ఈ పుస్తకంలోని రచనలన్నీ మధుసూదన్ రెడ్డి అనుభవ పాఠాలు. ఇందులో కొన్ని సరదాగా చదివించే కథలు. మరికొన్ని సీరియస్ గా ఆలోచింపజేసే వ్యాసాలు. మరికొన్ని రచయిత నేరుగా ముందుకొచ్చి తన అనుభవమే చెప్పి... ఇది మంచి, ఇది చెడు అని చెప్పే మాటలు. ఒక్కోసారి ఒకే రచనలో నాలుగైదు కథల వంటి దృష్టాంతాలుంటాయి. అన్నీ చదువరికి కొన్ని మంచి మాటలు చెబుదామని చేసిన ప్రయత్నాలే. కథలైనా, వ్యాసాలైనా, అనుభవ నివేదనలైనా జీవన విలువల గురించి మంచి, సెబ్బరలు చెప్పడమే ఈ రచనలన్నిటి ఉద్దేశం. పనిలో పనిగా ఇవాళ క్రమంగా కనుమరుగవుతున్న ఒక ప్రాంత జీవితాన్ని ఈ రచనలు రికార్డు చేస్తాయి. పాత నడతల స్థానంలో వొస్తున్న కొత్త పోకడలను ప్రస్తావిస్తాయి. అందులో మంచిచెడుల చర్చ చేస్తాయి. ఊరిలో దొంగతనం జరిగితే, అనుమానితులను కొట్టడం తప్పంటూనే, వంగబెట్టి బండలెత్తడం వంటి క్రూర గతావశేషాలను ఇంకా ఉన్నట్లు చెప్పకుండా వొదల్లేదు రచయిత. అదే సమయంలో, దేన్నీ ఊరక సమాచారం కోసం సమాచారం అన్నట్టు చెప్పలేదు. 'ఫ్యాక్ట్'తో పాటు తన 'కామెంటు' కూడా ఉంటుంది. బతుకు నీతిని, స్థానిక సంస్కృతిని పదుగురికి పరిచయం చేసే ప్రయత్నం ప్రతి రచనలో... ఒక సారి నేరుగా మరోసారి సూచనగా... కనిపిస్తాయి. అది కూడా పీఠం వేసుక్కూర్చున్న పీఠాధిపతిలా, మైకు పుచ్చుకుని నిలబడిన రాజకీయ నేతలా కాకుండా ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రేమగా చదువు చెప్పే టీచరు హితవచనాల్లో ఉంటాయి................© 2017,www.logili.com All Rights Reserved.