వంక గారు తన రాజకీయ జీవితంలో వేలాదిమందినే తట్టి ఉంటారు. ఆయనకు సంబంధించి చాలామందికి ఒక జ్ఞాపకమో, అనుభవమో ఒక సంఘటనో తప్పక ఉండి తీరుతుంది. అలాంటివెన్నో కలగలిస్తే కానీ, నిజానికి అయన జీవితకధ పూర్తి కాదు. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, మోనోగ్రాఫ్ ఏదైనా కావచ్చు. విస్తారమైన వారి జీవితవిశేషాలను ఒకచోట ఉంచటం కాస్తంత సంక్లిష్టమైన పనేనని చెప్పాలి. ఈ పని సులభతరం కావాలంటే జీవితచరిత్రలను వ్రాసుకునేవారు తమతమ దినచర్యలను తప్పక వ్రాసుకోవాలి. అయితే వంక వారు ఏనాడు తన దినచర్యలను వ్రాసుకోలేదు. ఆయన తన జ్ఞాపకాల మేరకే వారి స్వీయచరిత్రను వ్రాసుకున్నారు. కమ్యూనిజమే వేదంగా, సోషలిజం సాధనే మోక్షంగా చేసిన వారి అలుపెరగని అవిశ్రాంత పోరాటంలో ముఖ్యఘటనలనైనా వ్రాసిపెట్టుకునే తీరికవారికి దొరికి ఉండకపోవడం సహజమే. అయితే ఇంతటి సుదీర్ఘమైన తన జీవితస్మృతులలో జీవితానుభవాలను వెలికితీసి ఈ పండు వయస్సులో ఇలా వ్రాయబూనుకోవడం మాత్రం ఓ సాధరణ విషయమే.
శ్రీ వంక తన జీవితచరిత్రను చెబుతూ దానికి నేపధ్యమైన తన ప్రాంత సామాజిక, రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా మన కన్నుల ముందు నిలిపారు. అందుకే మన సామాజిక అవగాహనకు, సైద్ధాంతిక అధ్యయనానికి, ఉద్యమాల చరిత్రకూ ఈ పుస్తకమొక ప్రాతిపదిక కాగలదు.
కామ్రేడ్ వంక స్యతనారాయణ
వంక గారు తన రాజకీయ జీవితంలో వేలాదిమందినే తట్టి ఉంటారు. ఆయనకు సంబంధించి చాలామందికి ఒక జ్ఞాపకమో, అనుభవమో ఒక సంఘటనో తప్పక ఉండి తీరుతుంది. అలాంటివెన్నో కలగలిస్తే కానీ, నిజానికి అయన జీవితకధ పూర్తి కాదు. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, మోనోగ్రాఫ్ ఏదైనా కావచ్చు. విస్తారమైన వారి జీవితవిశేషాలను ఒకచోట ఉంచటం కాస్తంత సంక్లిష్టమైన పనేనని చెప్పాలి. ఈ పని సులభతరం కావాలంటే జీవితచరిత్రలను వ్రాసుకునేవారు తమతమ దినచర్యలను తప్పక వ్రాసుకోవాలి. అయితే వంక వారు ఏనాడు తన దినచర్యలను వ్రాసుకోలేదు. ఆయన తన జ్ఞాపకాల మేరకే వారి స్వీయచరిత్రను వ్రాసుకున్నారు. కమ్యూనిజమే వేదంగా, సోషలిజం సాధనే మోక్షంగా చేసిన వారి అలుపెరగని అవిశ్రాంత పోరాటంలో ముఖ్యఘటనలనైనా వ్రాసిపెట్టుకునే తీరికవారికి దొరికి ఉండకపోవడం సహజమే. అయితే ఇంతటి సుదీర్ఘమైన తన జీవితస్మృతులలో జీవితానుభవాలను వెలికితీసి ఈ పండు వయస్సులో ఇలా వ్రాయబూనుకోవడం మాత్రం ఓ సాధరణ విషయమే. శ్రీ వంక తన జీవితచరిత్రను చెబుతూ దానికి నేపధ్యమైన తన ప్రాంత సామాజిక, రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా మన కన్నుల ముందు నిలిపారు. అందుకే మన సామాజిక అవగాహనకు, సైద్ధాంతిక అధ్యయనానికి, ఉద్యమాల చరిత్రకూ ఈ పుస్తకమొక ప్రాతిపదిక కాగలదు. కామ్రేడ్ వంక స్యతనారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.