అమ్మను చూడాలి (నవల)
సిరిపల్లె ప్రైమరీ స్కూలులో ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతోంది.
వేదిక మీద డీఈఓ గారూ, హెడ్ మాస్టర్ గారూ ఇతర పెద్దలు కూర్చుని వున్నారు.
విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులూ, గ్రామ ప్రజలూ సభలో కూర్చుని వున్నారు.
హెడ్ మాస్టర్ గారు మైకులో మాట్లాడుతూ “డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన పాఠశాలలో అయిదవ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరం రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ లో గెలిచి ఛాంపియన్ అయిన సాగర్ చదువులోనూ బెస్ అనిపించుకున్నాడు. ఈ సంవత్సరం స్కూలు ఫస్ట్ వచ్చిన సాగర్ కి డీఈఓ గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరుగుతుంది” అని చెప్పి సాగర్ ను ఉద్దేశించి "సాగర్ స్టేజీ దగ్గరకు వచ్చి ప్రయిజు తీసుకో” అన్నారు. - కూర్చున్న విద్యార్థులలోంచి చెరగని చిరు నవ్వుతో గంభీరంగా, హుందాగా ఒక పదేళ్ల కుర్రాడు చక్కగా నడుచుకుంటూ స్టేజీ మీదకొచ్చి , డీఈఓ గారి చేతుల మీదుగా ప్రయిజు అందుకున్నాడు.
ముచ్చటగా ఉన్న ఆ అబ్బాయిని మురిపెంగా చూస్తూ డీఈఓ గారు అన్నారు. “బాబూ మీ నాన్న గారేం చేస్తారు. మీ పేరెంట్స్ రాలేదా” అని అడిగారు.
ఆ అబ్బాయి మొహంలో ఏ భావమూ లేకుండా ప్రయిజు వంక చూస్తుండిపోయాడు.
హెడ్ మాస్టర్ గారు కల్పించుకుంటూ “ఆ అబ్బాయి ఒక ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చి చదువుకుంటున్నాడు. అతను ఆ అనాధాశ్రమంలోనే..........
అమ్మను చూడాలి (నవల) సిరిపల్లె ప్రైమరీ స్కూలులో ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతోంది. వేదిక మీద డీఈఓ గారూ, హెడ్ మాస్టర్ గారూ ఇతర పెద్దలు కూర్చుని వున్నారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులూ, గ్రామ ప్రజలూ సభలో కూర్చుని వున్నారు. హెడ్ మాస్టర్ గారు మైకులో మాట్లాడుతూ “డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన పాఠశాలలో అయిదవ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరం రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ లో గెలిచి ఛాంపియన్ అయిన సాగర్ చదువులోనూ బెస్ అనిపించుకున్నాడు. ఈ సంవత్సరం స్కూలు ఫస్ట్ వచ్చిన సాగర్ కి డీఈఓ గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరుగుతుంది” అని చెప్పి సాగర్ ను ఉద్దేశించి "సాగర్ స్టేజీ దగ్గరకు వచ్చి ప్రయిజు తీసుకో” అన్నారు. - కూర్చున్న విద్యార్థులలోంచి చెరగని చిరు నవ్వుతో గంభీరంగా, హుందాగా ఒక పదేళ్ల కుర్రాడు చక్కగా నడుచుకుంటూ స్టేజీ మీదకొచ్చి , డీఈఓ గారి చేతుల మీదుగా ప్రయిజు అందుకున్నాడు. ముచ్చటగా ఉన్న ఆ అబ్బాయిని మురిపెంగా చూస్తూ డీఈఓ గారు అన్నారు. “బాబూ మీ నాన్న గారేం చేస్తారు. మీ పేరెంట్స్ రాలేదా” అని అడిగారు. ఆ అబ్బాయి మొహంలో ఏ భావమూ లేకుండా ప్రయిజు వంక చూస్తుండిపోయాడు. హెడ్ మాస్టర్ గారు కల్పించుకుంటూ “ఆ అబ్బాయి ఒక ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చి చదువుకుంటున్నాడు. అతను ఆ అనాధాశ్రమంలోనే..........© 2017,www.logili.com All Rights Reserved.