వంశీకి సినిమా దర్శకుడుగా బోలెడంత పేరు ప్రఖ్యాతలున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు. ఆయనకున్న సంగీత పరిజ్ఞానం తక్కువేం కాదని సినీరంగంలో ఉన్నవారికి మాత్రమే తెలుసు... ఇలా ఇంకా చాలామందికి చాలా రకాలుగా వంశీ తెలుసు. కానీ వంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టి కోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతికొద్దిమందికే తెలుసు. ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథాసంపుటం ద్వారా అందరకీ తెలిసిపోతాయి. ఒక్కమాటలో వంశీని సమగ్రంగా దర్శించడానికి ఈ కథాసంపుటం చాలు.
వంశీకి సినిమా దర్శకుడుగా బోలెడంత పేరు ప్రఖ్యాతలున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు. ఆయనకున్న సంగీత పరిజ్ఞానం తక్కువేం కాదని సినీరంగంలో ఉన్నవారికి మాత్రమే తెలుసు... ఇలా ఇంకా చాలామందికి చాలా రకాలుగా వంశీ తెలుసు. కానీ వంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టి కోణం గురించి, మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతికొద్దిమందికే తెలుసు. ఆ కొద్దిమందికి తెలిసిన లక్షణాలు ఈ కథాసంపుటం ద్వారా అందరకీ తెలిసిపోతాయి. ఒక్కమాటలో వంశీని సమగ్రంగా దర్శించడానికి ఈ కథాసంపుటం చాలు.© 2017,www.logili.com All Rights Reserved.