ప్రభుత్వాన్ని బయటనుంచి చూసేవాళ్ళకి విశాలమైన బంగళాల్లో నివసిస్తూ, ఎయిర్ కండిషన్డ్ కారుల్లో తిరిగే ఐఏఎస్
అధికారుల జీవితాలు అత్యంత సుఖవంతంగా ఉన్నట్లు అనిపించడం సహజం.
పాలనావ్యవస్థలోని కశ్మలాన్ని కడిగి పారేసి, సంస్కరించి పారేయాలన్న వీరావేశంతో ప్రభుత్వ సర్వీసుల్లోకి ప్రవేశించే
యువతీ యువకులకి ఆరంభంలో ఆవేశం, ఆత్మవిశ్వాసం అపరిమితంగా ఉండటం సహజం.