తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో
శ్రీమహావిష్ణువు వెలిశాడు.కాని,తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన
శంఖచక్రాలు ఇచ్చేశాడనీ,అందుకే ఆయన విగ్రహానికి మొదట్లో శంఖచక్రాలు వుండేవికావనీ…రామాయణ గాథలో
శ్రీరాముడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించి, తన స్వామిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పుష్కరిణిలో స్నానం చేశాడనీ…
తీర్థయాత్రలకు వెళ్లిన, ఒక బ్రాహ్మణుడి కుటుంబ బాధ్యత స్వీకరించిన చోళరాజు ఆ విషయం విస్మరిస్తే, వాళ్లు మరణిస్తే,
శ్రీనివాసుడు ఆదేశంతో ఆ రోజు తిరుమల క్షేత్రం మీద వున్న ‘అస్తికూట’ తీర్థాన్ని జల్లి వాళ్లని బ్రతికించాడనీ……ఇలాంటి
మన పన్నెండు పురణాలలో నిక్షిప్తమైవున్న అద్భుతాన్ని సరళమైన తెలుగులో సంకలనం చేసి తిరుమలతిరుపతి
దేవస్థానాల పూర్వపు కార్యనిర్వహణాధికారి, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ అందించిన శ్రీనివాసుడి
దివ్యగాథామృతమే ‘తిరుమల లీలామృతం’.