క్షరాలు అంటే నశించేవి. చంచలమైనవి అని అర్ధం. వాటికి అజ్ఞానంతో క్షరాలు కానివి - అక్షరాలు. కనుక అక్షరాలు అంటే .... అ,ఆ,ఇ,ఈ మొదలైన అక్షరాలు మాత్రమే కాదు. ఎన్నటికి నశించనివి. ఎటువంటి మార్పులకి లోను కానివి. నిత్యాలై ,అ అనంత సత్యాలై ఆణిముత్యాలై నిరంతరం నిలిచి వుండగలిగేవి. అంతేకాదు. అక్షరాలు ఉనికి దెబ్బతినదు. గొప్పతనం కొంచమైనా తగ్గదు. అక్షరాలకి ఆత్మ అనే అర్ధం కూడా ఉంది. కాబట్టి అత్మలాగే, అక్షరాలకి సయితం మృత్యువు వుండదు.
ఉదయం లేవగానే మనం ఎంతో ఆత్రంగా చదివే వార్తా పత్రికలోని అధికభాగం విలువ, ఆ సాయంత్రమో, మర్నాడో ఇంకో పత్రిక రాగానే, చాలావరకు తగ్గిపోతుంది. అలాగే, ఏ కొద్ది పుస్తకాలో తప్ప అధిక భాగం ప్రచురణలు 'పునరపి పఠనం... పునరపి పునరపి మననం' కి నోచుకోలేక పోతుంటాయి. జాన్ రస్కిన్ అన్నట్లు ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు తాత్కాలిక విలువలని కలిగి వుంటే, కొన్ని పుస్తకాలు మాత్రం మారే కలంతో మారని విలువలు వుండడం వల్ల శాశ్వతంగా నిలచి పోతుంటాయి.
అలా శాశ్వతంగా నిలిచిపోయేవే - అక్షరాలు !
నశ్వరమైన జగత్తులో అనశ్వరంగా ఉండిపోయే అక్షరాలు విశ్వవ్యాప్తంగా ఎందరో మహానుభావులు అందించిన సూక్తుల సారం నిండిన కమ్మదనాలు !!!
క్షరాలు అంటే నశించేవి. చంచలమైనవి అని అర్ధం. వాటికి అజ్ఞానంతో క్షరాలు కానివి - అక్షరాలు. కనుక అక్షరాలు అంటే .... అ,ఆ,ఇ,ఈ మొదలైన అక్షరాలు మాత్రమే కాదు. ఎన్నటికి నశించనివి. ఎటువంటి మార్పులకి లోను కానివి. నిత్యాలై ,అ అనంత సత్యాలై ఆణిముత్యాలై నిరంతరం నిలిచి వుండగలిగేవి. అంతేకాదు. అక్షరాలు ఉనికి దెబ్బతినదు. గొప్పతనం కొంచమైనా తగ్గదు. అక్షరాలకి ఆత్మ అనే అర్ధం కూడా ఉంది. కాబట్టి అత్మలాగే, అక్షరాలకి సయితం మృత్యువు వుండదు. ఉదయం లేవగానే మనం ఎంతో ఆత్రంగా చదివే వార్తా పత్రికలోని అధికభాగం విలువ, ఆ సాయంత్రమో, మర్నాడో ఇంకో పత్రిక రాగానే, చాలావరకు తగ్గిపోతుంది. అలాగే, ఏ కొద్ది పుస్తకాలో తప్ప అధిక భాగం ప్రచురణలు 'పునరపి పఠనం... పునరపి పునరపి మననం' కి నోచుకోలేక పోతుంటాయి. జాన్ రస్కిన్ అన్నట్లు ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు తాత్కాలిక విలువలని కలిగి వుంటే, కొన్ని పుస్తకాలు మాత్రం మారే కలంతో మారని విలువలు వుండడం వల్ల శాశ్వతంగా నిలచి పోతుంటాయి. అలా శాశ్వతంగా నిలిచిపోయేవే - అక్షరాలు ! నశ్వరమైన జగత్తులో అనశ్వరంగా ఉండిపోయే అక్షరాలు విశ్వవ్యాప్తంగా ఎందరో మహానుభావులు అందించిన సూక్తుల సారం నిండిన కమ్మదనాలు !!!
© 2017,www.logili.com All Rights Reserved.