ప్రస్తుత గ్రంధం 'రత్నకవి అనువాదలహరి' వాల్మీకి ఉత్తర రామాయణానికి వచన కృతి, రామక్రిష్ణానంద స్వామి ఆంగ్ల రచనకు 'కృష్ణ కథ' జాన్ డేవే రచన 'రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిలాసఫీ' కి తాత్విక తరంగాలు పేరుతో అనువాదం.శిశిర్ కుమార్ మిత్ర ఆంగ్ల రచన 'ది కల్చరల్ ఎంపైర్ ఆఫ్ ఇండియా' కు 'భారతీయ సంస్కృతి' అనువాదం.
దీనిలో ముఖ్యంగా 'కృష్ణ కథ' చాల గొప్ప అనువాదం. ప్రతి వాక్యం భావన మనకు శ్రీకృష్ణ పరమాత్మవైపు నడిపిస్తుంది. ఆంగ్ల మూలంలోని సొబగులన్నీ తెలుగు వైయ్యరాలతో అలరించాయి.భాగవతం మొత్తం ఒక్కసారిగా చదివిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఉత్తర రామాయణం కూడా. వాల్మీకి అడుగు జాడల్లో వీరి కథనశిల్పం గమిస్తుంటుంది. మిగిలిన రెండు గ్రంధాలలోని తాత్విక విచార ధార హృదయగమంగా ఉంటుంది. ఈ నాలుగు గ్రంథాలను ఒకే గ్రంధంగా వెలువరించడం ఆద్యాత్మిక రచనా పిపాసులకు అమృత కలశం లభించినట్లుగా ఉంటుంది.
ఈ గ్రందరాజం ఒక మహా తాత్వికుని మేధా రవళించిన అనువాద వంశిరవం!
-అంబటిపూడి.వెంకటరత్నం.
ప్రస్తుత గ్రంధం 'రత్నకవి అనువాదలహరి' వాల్మీకి ఉత్తర రామాయణానికి వచన కృతి, రామక్రిష్ణానంద స్వామి ఆంగ్ల రచనకు 'కృష్ణ కథ' జాన్ డేవే రచన 'రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిలాసఫీ' కి తాత్విక తరంగాలు పేరుతో అనువాదం.శిశిర్ కుమార్ మిత్ర ఆంగ్ల రచన 'ది కల్చరల్ ఎంపైర్ ఆఫ్ ఇండియా' కు 'భారతీయ సంస్కృతి' అనువాదం. దీనిలో ముఖ్యంగా 'కృష్ణ కథ' చాల గొప్ప అనువాదం. ప్రతి వాక్యం భావన మనకు శ్రీకృష్ణ పరమాత్మవైపు నడిపిస్తుంది. ఆంగ్ల మూలంలోని సొబగులన్నీ తెలుగు వైయ్యరాలతో అలరించాయి.భాగవతం మొత్తం ఒక్కసారిగా చదివిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఉత్తర రామాయణం కూడా. వాల్మీకి అడుగు జాడల్లో వీరి కథనశిల్పం గమిస్తుంటుంది. మిగిలిన రెండు గ్రంధాలలోని తాత్విక విచార ధార హృదయగమంగా ఉంటుంది. ఈ నాలుగు గ్రంథాలను ఒకే గ్రంధంగా వెలువరించడం ఆద్యాత్మిక రచనా పిపాసులకు అమృత కలశం లభించినట్లుగా ఉంటుంది. ఈ గ్రందరాజం ఒక మహా తాత్వికుని మేధా రవళించిన అనువాద వంశిరవం! -అంబటిపూడి.వెంకటరత్నం.
© 2017,www.logili.com All Rights Reserved.