భార్గవానందలహరి. సీ. భార్గవరావు
వీరు అం.వెం.రత్నం గారి శిష్యులు. ఇది ఖండకావ్యం. పన్నీరు, కన్నీరు, మున్నీరు అనే మూడు భాగాలుగా నున్నది. గురుభక్తీ, కృష్ణభక్తీ, దైవభక్తి గల వారుగా వీరి పద్యరచన సాగుతుంది. సంస్కృతాంధ్ర కవితా వ్యవసాయం చేసినవారు. వీరి 'కన్నీరు' ఖండిక పాఠకునికి చివరిదాకా చదివించగల ప్రేమ కావ్యంగా భాసిస్తుంది.
శ్రీరామకధాలహరి. వం.వేంకట చలపతిరావు
అం. వెంరత్నంగారి శిష్యులలో ఒకరు. సంస్కృతాంద్రాంగ్లా గ్రంధాలను గురువుగారి వద్ద విమర్శనాత్మకంగా, చదివిన కవి సత్తముడు. వీరి శ్రీరామకధాలహరిలో రామాయణం ఇమిడి యుంది. తానూ రామాయణం వ్రాసిన కవికావలెనన్న తపనతో రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దిన రచన.
కాదంబరి (పద్యనాటకం) గు.గోపాలకృష్ణశాస్త్రి
భట్ట బాణుని సంస్కృత గద్యరచన 'కాదంబరి'కీ పద్యనాటకంగా వ్రాసినవారు. ఇది ఐదంకాల పద్య నాటకం. ఇందు రసవత్తర ఘట్టాలతో చక్కని, సరళ సుందర శైలిలో పద్యాలతో సాగిన దృశ్యకావ్యం.
కృష్ణప్రభు శతకం.గోపీకావ్యం. అం.వెంకటరత్నం
'కృష్ణప్రభూ! మకుటంతో సాగిన రచన. ఉపనిషద్భావాలతో సాగిన స్వతంత్ర రచన. గోపికావ్యం. వీరి పద్యరచనా శక్తి చేతవిశేష ఛందాలు, విశిష్ట ఛందాలతో గోపికావ్యం సాగింది. ఛందోలంకారాలకు ఈ గ్రంథం లక్ష్య గ్రంధంగా ఉపకరిస్తుంది.
తెలుగు సిరి. అం.నరసింహశర్మ
తెలుగుసిరి. పాండిత్యం గల కవి వతంసులు. కాళిదాసు మేఘసందేశంలో చిత్రకూటము నుండి అలకాపురి వరకు మార్గవర్ణన గుర్తుకొస్తుంది. తెలుగు నేలలోని గ్రామాలను, పట్టణ సౌందర్యాలను, దైవాలను, రాజులను, నదులను, క్షేత్రాలను మనసారా వర్ణించారు.
భార్గవానందలహరి. సీ. భార్గవరావు వీరు అం.వెం.రత్నం గారి శిష్యులు. ఇది ఖండకావ్యం. పన్నీరు, కన్నీరు, మున్నీరు అనే మూడు భాగాలుగా నున్నది. గురుభక్తీ, కృష్ణభక్తీ, దైవభక్తి గల వారుగా వీరి పద్యరచన సాగుతుంది. సంస్కృతాంధ్ర కవితా వ్యవసాయం చేసినవారు. వీరి 'కన్నీరు' ఖండిక పాఠకునికి చివరిదాకా చదివించగల ప్రేమ కావ్యంగా భాసిస్తుంది. శ్రీరామకధాలహరి. వం.వేంకట చలపతిరావు అం. వెంరత్నంగారి శిష్యులలో ఒకరు. సంస్కృతాంద్రాంగ్లా గ్రంధాలను గురువుగారి వద్ద విమర్శనాత్మకంగా, చదివిన కవి సత్తముడు. వీరి శ్రీరామకధాలహరిలో రామాయణం ఇమిడి యుంది. తానూ రామాయణం వ్రాసిన కవికావలెనన్న తపనతో రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దిన రచన. కాదంబరి (పద్యనాటకం) గు.గోపాలకృష్ణశాస్త్రి భట్ట బాణుని సంస్కృత గద్యరచన 'కాదంబరి'కీ పద్యనాటకంగా వ్రాసినవారు. ఇది ఐదంకాల పద్య నాటకం. ఇందు రసవత్తర ఘట్టాలతో చక్కని, సరళ సుందర శైలిలో పద్యాలతో సాగిన దృశ్యకావ్యం. కృష్ణప్రభు శతకం.గోపీకావ్యం. అం.వెంకటరత్నం 'కృష్ణప్రభూ! మకుటంతో సాగిన రచన. ఉపనిషద్భావాలతో సాగిన స్వతంత్ర రచన. గోపికావ్యం. వీరి పద్యరచనా శక్తి చేతవిశేష ఛందాలు, విశిష్ట ఛందాలతో గోపికావ్యం సాగింది. ఛందోలంకారాలకు ఈ గ్రంథం లక్ష్య గ్రంధంగా ఉపకరిస్తుంది. తెలుగు సిరి. అం.నరసింహశర్మ తెలుగుసిరి. పాండిత్యం గల కవి వతంసులు. కాళిదాసు మేఘసందేశంలో చిత్రకూటము నుండి అలకాపురి వరకు మార్గవర్ణన గుర్తుకొస్తుంది. తెలుగు నేలలోని గ్రామాలను, పట్టణ సౌందర్యాలను, దైవాలను, రాజులను, నదులను, క్షేత్రాలను మనసారా వర్ణించారు.© 2017,www.logili.com All Rights Reserved.