మన భారతీయ వాజ్మయంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. నారాయణుడి స్వరూపమైన ధన్వంతరి ద్వారా ఎన్నో ఆయుర్వేద యోగాలు మానవాళికి అందించబడ్డాయి. తరువాతకాలంలో ఆయుర్వేద త్రయంగా ప్రసిద్ధి పొందిన చరకమహర్షి, శుశ్రుతుడు, వాగ్భాటుడు. తమ తమ గ్రంధాల ద్వారా ఆయుర్వేద వైద్య విధానాల్ని విస్తృతంగా ప్రచారం చేసారు. మానవాళికి మహోపకారం చేసిన ఈ ముగ్గురు మహర్షులూ తమ రచనలైన చరకసంహిత, శుశ్రుతసంహిత,అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం గ్రంధాలలో శరీశక్తిని, శృంగార పటుత్వాన్ని, దీర్ఘాయుర్ధాయాన్ని కలిగించే ఎన్నో రసాయన వాజీకర ఔషధాలు, వాటి తయారీ విధానాలు గురించి ప్రామాణికంగా తెలియచేసారు. అలాగే వీరితోపాటు శారంగధరుడనే వైద్యుడు కూడా మరికొన్ని ఔశాధల్ని, యోగాల్ని పేర్కొన్నాడు.
రసాయన వాజీకర తంత్రం అనే ఈ గ్రంధంలో చరక, శుశ్రుత, వాగ్భట, శారంగదారులు, చెప్పిన రసాయన, ఔషధాలు, వాజీకర యోగాలు ఒక వరుసక్రమంలో సంకలనం చేయబడ్డాయి. ఈ గ్రంధానికి సంబంధించిన సుమారు 80సంవత్సాలు పూర్వం నాటి ప్రాచీన ప్రతి ఒకటి మాకు లభించింది ఎంతో శిధిలావస్థలలో వున్న ఆ గ్రంథం వైద్యరాజ పండిత శ్రీ భైరవమూర్తిగారు సంకలనం చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతో విలువైన ఆ గ్రంథం పాఠకులకి, వైద్యులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి దానిని సంస్కరించి తిరిగి ప్రచురిస్తున్నాం.
ఇందులో చెప్పిన వివిధ రకాల ఔషధాలు, యోగాలు అన్నీ ఎంతో ప్రాచీనమైనవి. నేటి ఆధునిక కాలంలో కూడా వాటి ప్రభావం చాలా గొప్పగా వుంటుంది. అందుకు నిదర్శనం నేడు ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న జనాదరణే. అయితే పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే? ఈ గ్రంధంలో చెప్పిన యోగాలలో కొన్ని అందరూ వినియోగించే విధంగా ఉంటాయి. మరికొన్ని ఆయుర్వేద వైద్యులకు మాత్రమే తెలిసే విధంగా వుంటాయి. కనుక సరియైన జాగ్రత్తలు తీసుకొని సమర్ధులైన వైద్యులను సంప్రదించి ఈ గ్రంధంలోని ఔషధాలను వినియోగించు కోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
మన భారతీయ వాజ్మయంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. నారాయణుడి స్వరూపమైన ధన్వంతరి ద్వారా ఎన్నో ఆయుర్వేద యోగాలు మానవాళికి అందించబడ్డాయి. తరువాతకాలంలో ఆయుర్వేద త్రయంగా ప్రసిద్ధి పొందిన చరకమహర్షి, శుశ్రుతుడు, వాగ్భాటుడు. తమ తమ గ్రంధాల ద్వారా ఆయుర్వేద వైద్య విధానాల్ని విస్తృతంగా ప్రచారం చేసారు. మానవాళికి మహోపకారం చేసిన ఈ ముగ్గురు మహర్షులూ తమ రచనలైన చరకసంహిత, శుశ్రుతసంహిత,అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం గ్రంధాలలో శరీశక్తిని, శృంగార పటుత్వాన్ని, దీర్ఘాయుర్ధాయాన్ని కలిగించే ఎన్నో రసాయన వాజీకర ఔషధాలు, వాటి తయారీ విధానాలు గురించి ప్రామాణికంగా తెలియచేసారు. అలాగే వీరితోపాటు శారంగధరుడనే వైద్యుడు కూడా మరికొన్ని ఔశాధల్ని, యోగాల్ని పేర్కొన్నాడు. రసాయన వాజీకర తంత్రం అనే ఈ గ్రంధంలో చరక, శుశ్రుత, వాగ్భట, శారంగదారులు, చెప్పిన రసాయన, ఔషధాలు, వాజీకర యోగాలు ఒక వరుసక్రమంలో సంకలనం చేయబడ్డాయి. ఈ గ్రంధానికి సంబంధించిన సుమారు 80సంవత్సాలు పూర్వం నాటి ప్రాచీన ప్రతి ఒకటి మాకు లభించింది ఎంతో శిధిలావస్థలలో వున్న ఆ గ్రంథం వైద్యరాజ పండిత శ్రీ భైరవమూర్తిగారు సంకలనం చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతో విలువైన ఆ గ్రంథం పాఠకులకి, వైద్యులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి దానిని సంస్కరించి తిరిగి ప్రచురిస్తున్నాం. ఇందులో చెప్పిన వివిధ రకాల ఔషధాలు, యోగాలు అన్నీ ఎంతో ప్రాచీనమైనవి. నేటి ఆధునిక కాలంలో కూడా వాటి ప్రభావం చాలా గొప్పగా వుంటుంది. అందుకు నిదర్శనం నేడు ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న జనాదరణే. అయితే పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే? ఈ గ్రంధంలో చెప్పిన యోగాలలో కొన్ని అందరూ వినియోగించే విధంగా ఉంటాయి. మరికొన్ని ఆయుర్వేద వైద్యులకు మాత్రమే తెలిసే విధంగా వుంటాయి. కనుక సరియైన జాగ్రత్తలు తీసుకొని సమర్ధులైన వైద్యులను సంప్రదించి ఈ గ్రంధంలోని ఔషధాలను వినియోగించు కోవాల్సిందిగా కోరుకుంటున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.