ఇది పాబ్లో నెరూడా కవిత్వానికున్న పార్శ్వాలు. ప్రతి పంక్తీ, వెదజల్లే విస్ఫూలింగాలు.
కవిని అర్థం చేసుకోడానికి పాఠకునికో నేపథ్యం ఉండాలి. ఆ కవి కవిత్వాన్ని ఆస్వాదించడానికి కో అర్హత ఉండాలి.
మానవత్వాన్ని ఆహ్వానించగల హృదయం, మంచితనాన్ని గుర్తించగల నేత్రం, మమతానురాగాల్ని మంటగలిపే శక్తులను పసిగట్టగల వివేకం, కవి చెయ్యి పట్టుకొని సాగగల సామర్ధ్యం వెసులుబాటు, ఈ చేవ ఉన్న నేటి తరం కవుల్లో పాఠకుల్లో నెరూడా నిలిచే ఉన్నాడు - వాళ్లకు తన కవితలను వినిపిస్తూనే ఉంటాడు.
- పాబ్లో నెరూడా
శ్రామిక జన శంఖారావం
శ్రమకంఠపురణన్నినాదం
కార్మిక గళ కవితాగానం
పాటకజన పదవిన్యాసం
పాలక దురహంతల తల పై
ప్రజలెట్టిన పదవిన్యాసం
జన జీవిత సుందరగానం
దోపిడి పై ఢంకాధ్వానం