తెలుగువారైన బౌద్ధులకు సంబంధించిన వివరాలకు కేవలం భౌద్ధ గ్రంధాలే ఆధారం "భక్తీ" వున్నచోట చరిత్ర అతిశయోక్తులకు లోనవటం సహజం. ఈ అతిశయోక్తుల్లోంచే మనం మన ప్రాచీన చరిత్రను అన్వేషించుకోవాల్సి వస్తుంది.
బుద్ధుడు ఏ కాలం నాటివాడు? బుద్ధుడి జీవిత కాలంలో వింధ్యను దాటి భౌద్ధం విస్తరించిందా? బుద్ధుడు నిజంగానే అమరావతి వచ్చాడా? బుద్ధుడు వచ్చినట్లు చెబ్తున్న ధనకటకం అమరావతేనా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.
బుద్ధుడు సింహళానికి మూడు సార్లు వెళ్ళినట్లు మహావంశంలో చెప్పిన ఆధారాలు నిజమే అయితే, సముద్ర మర్గాన వెళ్ళినా దారిలో తెలుగు ప్రాంతాన్ని సందర్శించే వుంటాడని ఊహించవచ్చు.
ఇవన్నీ ఊహలే!... అవునన్న వారివీ - కాదన్న వారివీ కూడా ఊహలే!! తమ నమ్మకాల మీద ఆమాత్రం నమ్మకం వుండాలి. కాబట్టి కొందరు చరిత్రకారులు "ఇదే వాస్తవం" కానీ, రకరకాల ఊహల్లో అది కూడా ఒకటి!
ఇక్కడ చరిత్రను పరిశీలించే దృష్టి కోణమే ముఖ్యం. మనం చరిత్రను అధ్యయనం చేయడానికి ఒక "లక్ష్యం" పెట్టుకోవాలి. ఆ "దృష్టి" తోనే చారిత్రక విషయాన్ని పరిశీలించాలి.
ఈ సమాజాన్ని "వర్ణాలు"గా లేదా "కులాలు"గా విభజించి పాలిస్తున్న కుసంస్కృతి మీద భౌద్ధధర్మాల పోరాటం, వాటి విజయాలు, వాటి వైఫల్యానికి కొంతమేర వివరించే ప్రయత్నం చేశాను.
కులతత్వాన్ని రోజురోజుకూ పెంచి పోషిస్తున్న వ్యవస్థలో జీవిస్తున్న మనం - ఒక్కసారి బుద్ధదేవుడి గురించి, ఆయన భోధనల గురించి దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఈ "బుద్ధదేవుని కధ" పరివర్తన దిశగా ఒక కొత్త ఆలోచనని కల్గించగలిగితే చరిత్ర అధ్యయనపరుడిగా ధన్యత నొందినట్లు భావిస్తాను.
- డా. జి.వి. పూర్ణచంద్
తెలుగువారైన బౌద్ధులకు సంబంధించిన వివరాలకు కేవలం భౌద్ధ గ్రంధాలే ఆధారం "భక్తీ" వున్నచోట చరిత్ర అతిశయోక్తులకు లోనవటం సహజం. ఈ అతిశయోక్తుల్లోంచే మనం మన ప్రాచీన చరిత్రను అన్వేషించుకోవాల్సి వస్తుంది. బుద్ధుడు ఏ కాలం నాటివాడు? బుద్ధుడి జీవిత కాలంలో వింధ్యను దాటి భౌద్ధం విస్తరించిందా? బుద్ధుడు నిజంగానే అమరావతి వచ్చాడా? బుద్ధుడు వచ్చినట్లు చెబ్తున్న ధనకటకం అమరావతేనా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. బుద్ధుడు సింహళానికి మూడు సార్లు వెళ్ళినట్లు మహావంశంలో చెప్పిన ఆధారాలు నిజమే అయితే, సముద్ర మర్గాన వెళ్ళినా దారిలో తెలుగు ప్రాంతాన్ని సందర్శించే వుంటాడని ఊహించవచ్చు. ఇవన్నీ ఊహలే!... అవునన్న వారివీ - కాదన్న వారివీ కూడా ఊహలే!! తమ నమ్మకాల మీద ఆమాత్రం నమ్మకం వుండాలి. కాబట్టి కొందరు చరిత్రకారులు "ఇదే వాస్తవం" కానీ, రకరకాల ఊహల్లో అది కూడా ఒకటి! ఇక్కడ చరిత్రను పరిశీలించే దృష్టి కోణమే ముఖ్యం. మనం చరిత్రను అధ్యయనం చేయడానికి ఒక "లక్ష్యం" పెట్టుకోవాలి. ఆ "దృష్టి" తోనే చారిత్రక విషయాన్ని పరిశీలించాలి. ఈ సమాజాన్ని "వర్ణాలు"గా లేదా "కులాలు"గా విభజించి పాలిస్తున్న కుసంస్కృతి మీద భౌద్ధధర్మాల పోరాటం, వాటి విజయాలు, వాటి వైఫల్యానికి కొంతమేర వివరించే ప్రయత్నం చేశాను. కులతత్వాన్ని రోజురోజుకూ పెంచి పోషిస్తున్న వ్యవస్థలో జీవిస్తున్న మనం - ఒక్కసారి బుద్ధదేవుడి గురించి, ఆయన భోధనల గురించి దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఈ "బుద్ధదేవుని కధ" పరివర్తన దిశగా ఒక కొత్త ఆలోచనని కల్గించగలిగితే చరిత్ర అధ్యయనపరుడిగా ధన్యత నొందినట్లు భావిస్తాను. - డా. జి.వి. పూర్ణచంద్© 2017,www.logili.com All Rights Reserved.