1960 దశాబ్దంలో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికానుండి దిగుమతి చేసుకున్న వైట్ లెగ్ హార్న్, రోడ్ ఐలాండ్ రెడ్ మొదలైన కోళ్ళతో మనదేశంలో ప్రారంభమైన హైబ్రిడ్ కోళ్ళ పెంపకం, నేడు గణనీయంగా అభివృద్ధి చెంది, పారిశ్రామిక స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం, ఐ.వి.ఆర్.ఐ., ఐ.సీ.ఎ.ఆర్., వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, కోళ్ళ పరిశోధనా సంస్థలు, పశుసంవర్ధకశాఖ మొదలైన ప్రభుత్వరంగ సంస్థలు మరియు నెక్, ప్రవైట్ బ్రిడర్స్ మొదలైన ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం, కృషి ఈ అభివృద్ధిలో ఎంతగానో ఉంది. నాబార్డు బ్యాంకులు, డిఆర్ డిఎ మొదలైన సంస్థలు వివిధ పధకాల క్రింద ఋణాలు అందిస్తూ పౌల్ట్రీ అభివృద్ధిలో తమవంతు కృషి చేశాయి.
ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10-12% సగటు వృద్ధి రేటుతో పురోభివృద్ధిలో ఉండి, దేశంలో 70వేల కోట్లు, రాష్ట్రంలో 20వేల కోట్ల స్థాయికి పౌల్ట్రీ పరిశ్రమ చేరింది. దేశంలో పెరుగుతున్న జనాభా పౌష్టిక అవసరాల్ని మాంసం, గ్రుడ్లు ద్వారా తీరుస్తూ, పొలాలకు విలువైన ఎరువును అందిస్తూ, గ్రామీణ ప్రాంత ఆర్ధిక అభ్యున్నతికి దోహదపడ్తున్నది. గడిచిన రెండేళ్ళలో మాంసం, గ్రుడ్ల రేట్లు ఆశాజనకంగా ఉండడంతో లేయర్ పరిశ్రమలో 12%, బ్రాయిలర్ పరిశ్రమలో 20% వృద్ధి నమోదయింది. ఈ విధంగా రైతుల ఆదాయం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు బకాయి ఉన్న నాలా చార్జీలను మాఫీ చేయడమే కాకుండా, ప్రతి యేటా చెల్లించే నాలా చార్జీలను రద్దు చేయడం, పామాయిల్ పై వాట్ ను, కోడి మాంసం గుడ్లపై వసూలు చేస్తున్న సెస్ ను ఎత్తివేయడం, కోళ్ళ పరిశ్రమకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరను సగానికి తగ్గించడం మొదలగు చర్యలన్నీ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న మన దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ మరింత పురోభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మన దేశం, మన రాష్ట్రం ప్రముఖ స్థానంలో నిలిచి, ప్రజానిక ఆర్ధిక అభ్యున్నతికీ దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌల్ట్రీ పెంపకం దార్లు తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడి ఆశించడానికి, శాస్త్రీయపరమైన వ్యాధుల్ని ముందే జీవనియంత్రణ పద్ధతుల్ని ఆచరిస్తూ నివారించుకోవడ, బర్డ్ ప్లూ, గంబోరోలాంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని ముందే జీవనియంత్రణ పద్ధతుల్ని ఆచరిస్తూ నివారించుకోవడం, ఆధునిక పరికరాలు వాడుతూ సమయం, శ్రమ, కూలీలపై వ్యయం తగ్గించుకోవడం మొదలైన విషయాల్లో శ్రద్ధ చూపించాలి. బ్రాయిలర్ లేయర్ కోళ్ళ పెంపక విధానాలు, ఆహరం, వ్యాధులు - నివారణ, ఆధునిక యంత్రాలు, సిస్టంలు, మేలైన యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాలపై డా.సి.హెచ్.రమేశ్ వ్రాసిన ఈ పుస్తకం పౌల్ట్రీ పెంపకందార్లకు, ఔత్సాహికులకు శాస్త్రీయపరమైన అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాము.
1960 దశాబ్దంలో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికానుండి దిగుమతి చేసుకున్న వైట్ లెగ్ హార్న్, రోడ్ ఐలాండ్ రెడ్ మొదలైన కోళ్ళతో మనదేశంలో ప్రారంభమైన హైబ్రిడ్ కోళ్ళ పెంపకం, నేడు గణనీయంగా అభివృద్ధి చెంది, పారిశ్రామిక స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం, ఐ.వి.ఆర్.ఐ., ఐ.సీ.ఎ.ఆర్., వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, కోళ్ళ పరిశోధనా సంస్థలు, పశుసంవర్ధకశాఖ మొదలైన ప్రభుత్వరంగ సంస్థలు మరియు నెక్, ప్రవైట్ బ్రిడర్స్ మొదలైన ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం, కృషి ఈ అభివృద్ధిలో ఎంతగానో ఉంది. నాబార్డు బ్యాంకులు, డిఆర్ డిఎ మొదలైన సంస్థలు వివిధ పధకాల క్రింద ఋణాలు అందిస్తూ పౌల్ట్రీ అభివృద్ధిలో తమవంతు కృషి చేశాయి. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10-12% సగటు వృద్ధి రేటుతో పురోభివృద్ధిలో ఉండి, దేశంలో 70వేల కోట్లు, రాష్ట్రంలో 20వేల కోట్ల స్థాయికి పౌల్ట్రీ పరిశ్రమ చేరింది. దేశంలో పెరుగుతున్న జనాభా పౌష్టిక అవసరాల్ని మాంసం, గ్రుడ్లు ద్వారా తీరుస్తూ, పొలాలకు విలువైన ఎరువును అందిస్తూ, గ్రామీణ ప్రాంత ఆర్ధిక అభ్యున్నతికి దోహదపడ్తున్నది. గడిచిన రెండేళ్ళలో మాంసం, గ్రుడ్ల రేట్లు ఆశాజనకంగా ఉండడంతో లేయర్ పరిశ్రమలో 12%, బ్రాయిలర్ పరిశ్రమలో 20% వృద్ధి నమోదయింది. ఈ విధంగా రైతుల ఆదాయం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు బకాయి ఉన్న నాలా చార్జీలను మాఫీ చేయడమే కాకుండా, ప్రతి యేటా చెల్లించే నాలా చార్జీలను రద్దు చేయడం, పామాయిల్ పై వాట్ ను, కోడి మాంసం గుడ్లపై వసూలు చేస్తున్న సెస్ ను ఎత్తివేయడం, కోళ్ళ పరిశ్రమకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరను సగానికి తగ్గించడం మొదలగు చర్యలన్నీ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న మన దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ మరింత పురోభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మన దేశం, మన రాష్ట్రం ప్రముఖ స్థానంలో నిలిచి, ప్రజానిక ఆర్ధిక అభ్యున్నతికీ దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌల్ట్రీ పెంపకం దార్లు తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడి ఆశించడానికి, శాస్త్రీయపరమైన వ్యాధుల్ని ముందే జీవనియంత్రణ పద్ధతుల్ని ఆచరిస్తూ నివారించుకోవడ, బర్డ్ ప్లూ, గంబోరోలాంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని ముందే జీవనియంత్రణ పద్ధతుల్ని ఆచరిస్తూ నివారించుకోవడం, ఆధునిక పరికరాలు వాడుతూ సమయం, శ్రమ, కూలీలపై వ్యయం తగ్గించుకోవడం మొదలైన విషయాల్లో శ్రద్ధ చూపించాలి. బ్రాయిలర్ లేయర్ కోళ్ళ పెంపక విధానాలు, ఆహరం, వ్యాధులు - నివారణ, ఆధునిక యంత్రాలు, సిస్టంలు, మేలైన యాజమాన్య పద్ధతులు మొదలైన అంశాలపై డా.సి.హెచ్.రమేశ్ వ్రాసిన ఈ పుస్తకం పౌల్ట్రీ పెంపకందార్లకు, ఔత్సాహికులకు శాస్త్రీయపరమైన అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.