వనరాజా, గిరిరాజ వంటి అభివృద్ధిపరచిన పెరటి కోళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళు, గినికోళ్ళు, క్వయల్ పక్షులు మొదలగు వివిధ రకాల కోళ్ళ జాతులను పెంచడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కనబడుతూనే ఉంది. వారు మార్కెట్ లో డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో కోళ్ళ రకాలకు పెంచుతూ, అదనంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. లక్షల రూపాయల పెట్టుబడితో కమర్షియల్ పౌల్ట్రీ స్థాపించలేని , చిన్నకారు, సన్నకారు రైతాంగానికి, ఔత్సాహికులకు ఈ కోళ్ళ రకాల పెంపకం వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కోళ్ళ రకాలను పెంచడం ద్వారా వచ్చే మాంసం, గుడ్లు అధిక పోషక విలువలు కలిగి ఉండి, ఇంచుమించుగా సేంద్రియ ఉత్పత్తుల మాదిరిగా ఉంటున్నందున , వినియోగదారులకు ఆరోగ్యపరంగా, పెంపకందార్లకు ఆర్థికపరంగా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం ప్రస్తుతం పెంపకందార్లకకు మరియు నూతనంగా ఈ రంగంలో వచ్చే వారికీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను.