ఇది లియోనార్డో డావిన్సీ అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాధ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్తి, చింతనాపరుడికి ఉండే హేతుబద్దత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలు ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువు పరిశీలకుడు సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లియోనార్డో చిత్రాలన్నీ కళా ఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించి మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్పోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలని, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్ధాలు అన్వేషిస్తూ ఉండాలని అనిపించేలా చేస్తాయి.
లియోనార్డో జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాడమైన అన్వేషణ... మతభావనల చిత్రీకరణలోను, మనుషుల చిత్రీకరణ లోను అయన ఆ అన్వేషణా ఫలితాలు రంగరించాడు. లియోనార్డో మహాద్బుత వర్ణమయ జీవితాన్ని మోహన్ అంతే వర్ణమయంగా అక్షరాలకేక్కించాడు. ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలవుతోంది. అయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహనగానం ఈ పుస్తకం. చదవండి.
.... ఎన్.వేణుగోపాల్
తెలుగులో డావిన్సీ అందాలు
డావిన్సీ అంటే మోనాలిసా. మోనాలిసా అంటే డావిన్సీ. సగటు మనిషి సాధారణ అవగాహన ఇది. అతనూ, ఆ బొమ్మా అంతగా మన జ్ఞాపకాల్లో పెనువేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తక రచయిత మోహన్ (ప్రముఖ కార్టూనిస్టు మోహన్ ఈయనా ఒకరు కారు) 'కళల వయ్యారి సిగలో డావిన్సీ అలంకరించిన వెయ్యి రేకుల మల్లెపువ్వు పరిమళం మోనాలిసా. ఆ మానవి సమ్మోహన రూపం ఐదు వందల ఏళ్ళుగా మానవాళి నేత్ర వీధుల్లో జగన్నాథ రథంలో ఊరేగుతోంది. మోనాలిసా అతని కళారంగనాయక.
తన రంగుల గుడిలో వెలిగించుకున్న అఖండ దీపం' అంటూ అద్భుతంగా రచయిత వర్ణించారు. పదిహేనో శతాబ్ది చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ. కళకు, శాస్త్రానికి ఘనంగా వివాహం జరిపించిన మహా మేధావి. తెలుగులో ఈయనపై సమగ్రమైన గ్రంథం ఏదీ లేదు. ఆ లోటు ఈ పుస్తకంతో తీరిందనే చెప్పవచ్చు. డావిన్సీ చిత్రించిన బొమ్మలకు తేట తెలుగులో వివరణను జోడించారు రచయిత. డావిన్సీ వ్యక్తిగత జీవితం, ఆయన వేసిన బొమ్మలు, వాటి వెనక నేపథ్యం, ఆయా బొమ్మల అందచందాలు, అప్పటి ప్రాపంచిక పరిస్థితులు తదితరాలన్నింటినీ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ఎన్.కె.వేణుగోపాల్ మాటల్లో చెప్పాలంటే, కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే వర్ణదృష్టి , చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు.
ఆ మాట ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. పికాసో పుస్తకంతో చేతులు కాలినప్పటికీ ఆకులు పట్టుకోకుండా, ఆ మంటల్లోనే మళ్ళీ కరములను కడవరకు ముంచానని రచయిత ముందుమాటలోనే మనవి చేశారు. పుస్తకం బాగుంటే పదిమందికీ చెప్పి కొనిపించండని, అదే తనకు సహాయమని కూడా విన్నవించారు. కళ్ళను కట్టినిలిపే బొమ్మలు, మనసును హత్తుకనే వాక్యాలు కలగలిసిన పుస్తకం ఎవరికి మాత్రం రుచించదు?
- మద్దిపట్ల మణి
డావిన్సీ ఇది లియోనార్డో డావిన్సీ అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాధ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్తి, చింతనాపరుడికి ఉండే హేతుబద్దత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలు ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువు పరిశీలకుడు సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లియోనార్డో చిత్రాలన్నీ కళా ఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించి మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్పోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలని, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్ధాలు అన్వేషిస్తూ ఉండాలని అనిపించేలా చేస్తాయి. లియోనార్డో జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాడమైన అన్వేషణ... మతభావనల చిత్రీకరణలోను, మనుషుల చిత్రీకరణ లోను అయన ఆ అన్వేషణా ఫలితాలు రంగరించాడు. లియోనార్డో మహాద్బుత వర్ణమయ జీవితాన్ని మోహన్ అంతే వర్ణమయంగా అక్షరాలకేక్కించాడు. ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలవుతోంది. అయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహనగానం ఈ పుస్తకం. చదవండి. .... ఎన్.వేణుగోపాల్ తెలుగులో డావిన్సీ అందాలు డావిన్సీ అంటే మోనాలిసా. మోనాలిసా అంటే డావిన్సీ. సగటు మనిషి సాధారణ అవగాహన ఇది. అతనూ, ఆ బొమ్మా అంతగా మన జ్ఞాపకాల్లో పెనువేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తక రచయిత మోహన్ (ప్రముఖ కార్టూనిస్టు మోహన్ ఈయనా ఒకరు కారు) 'కళల వయ్యారి సిగలో డావిన్సీ అలంకరించిన వెయ్యి రేకుల మల్లెపువ్వు పరిమళం మోనాలిసా. ఆ మానవి సమ్మోహన రూపం ఐదు వందల ఏళ్ళుగా మానవాళి నేత్ర వీధుల్లో జగన్నాథ రథంలో ఊరేగుతోంది. మోనాలిసా అతని కళారంగనాయక. తన రంగుల గుడిలో వెలిగించుకున్న అఖండ దీపం' అంటూ అద్భుతంగా రచయిత వర్ణించారు. పదిహేనో శతాబ్ది చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ. కళకు, శాస్త్రానికి ఘనంగా వివాహం జరిపించిన మహా మేధావి. తెలుగులో ఈయనపై సమగ్రమైన గ్రంథం ఏదీ లేదు. ఆ లోటు ఈ పుస్తకంతో తీరిందనే చెప్పవచ్చు. డావిన్సీ చిత్రించిన బొమ్మలకు తేట తెలుగులో వివరణను జోడించారు రచయిత. డావిన్సీ వ్యక్తిగత జీవితం, ఆయన వేసిన బొమ్మలు, వాటి వెనక నేపథ్యం, ఆయా బొమ్మల అందచందాలు, అప్పటి ప్రాపంచిక పరిస్థితులు తదితరాలన్నింటినీ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ఎన్.కె.వేణుగోపాల్ మాటల్లో చెప్పాలంటే, కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే వర్ణదృష్టి , చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మాట ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. పికాసో పుస్తకంతో చేతులు కాలినప్పటికీ ఆకులు పట్టుకోకుండా, ఆ మంటల్లోనే మళ్ళీ కరములను కడవరకు ముంచానని రచయిత ముందుమాటలోనే మనవి చేశారు. పుస్తకం బాగుంటే పదిమందికీ చెప్పి కొనిపించండని, అదే తనకు సహాయమని కూడా విన్నవించారు. కళ్ళను కట్టినిలిపే బొమ్మలు, మనసును హత్తుకనే వాక్యాలు కలగలిసిన పుస్తకం ఎవరికి మాత్రం రుచించదు? - మద్దిపట్ల మణి
© 2017,www.logili.com All Rights Reserved.