న్యాయవాది అయ్యాను
నేను న్యాయవాది అవడానికి దారితీసిన కారణాలను, న్యాయవాద వృత్తిలో శిష్యరికం, బార్ కు వెళ్ళడం, తర్వాత ముంబయి, చెన్నై, హైదరాబాద్ లో న్యాయవాదిగా పనిచేయడం, హైదరాబాద్ హై కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం వంటి విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాలా? వద్దా? అనే ప్రశ్నలతో నాలో నేనే పలు సందర్భాల్లో తర్జన భర్జన అయ్యాను. పలు దఫాలుగా నాలోనేనే చర్చించుకున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే న్యాయస్థానంలో నా ప్రస్థానం గురించి చెప్పాలన్నప్పుడు న్యాయవాద వృత్తిలో నా అనుభవాలు కూడా ప్రస్తావించాలా? ఆ అనుభవాలు, ఆ తర్వాత హై కోర్ట్ జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నా జ్ఞాపకాలలో నా న్యాయవాద వృత్తి అనుభవాలు కూడా చేర్చాలా? వద్దా అని కూడా తర్కించుకున్నాను.
న్యాయవాద వృత్తి కూడా న్యాయ వ్యవస్థలో భాగమే అనడంలో నాకెలాంటి సందేహం లేదు. న్యాయమూర్తులు కోర్టులో న్యాయనిర్ణేత స్థానంలో కూర్చున్నట్టీ న్యాయవాదులు కూడా ఆ న్యాయస్థానాల్లో భాగస్వాములే అని నా ప్రగాఢ విశ్వాసం. గతంలో నేను రాసిన The Revolutions I Have Lived Through అనే నా స్వీయ చరిత్రలో నా న్యాయవాద విద్యాభ్యాసం నుండి న్యాయవాద వృత్తి, న్యాయమూర్తి పదవి వరకూ అనేక విషయాలు ప్రస్తావించాను కాబట్టి ఇప్పుడు మరోసారి ఆ విషయాలన్నీ ప్రస్తావించడం పునశ్చరణం అవుతుందేమో అనే సందిగ్ధం కలిగింది. గతంలో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో మళ్ళీ వివరించాల్సి వస్తే అదో పెద్ద గ్రంధమే అవుతుంది అని అలోచించి, ఈ పుస్తకాన్ని కొంతమేరకు పరిమితం చేశాను. పూర్తివివరాలు కావాలనుకునే పాఠకులు ఇంతకుముందు నేను రాసిన పుస్తకం చదివితే సరిపోతుంది అని అనుకుని ఈ పుస్తకాన్ని గతంలో ఎక్కడ ముగించానో అక్కడినుండి ప్రారంభించాలని నిర్ణయించాను. అయితే నా మునుపటి పుస్తకంలో....................
న్యాయవాది అయ్యాను నేను న్యాయవాది అవడానికి దారితీసిన కారణాలను, న్యాయవాద వృత్తిలో శిష్యరికం, బార్ కు వెళ్ళడం, తర్వాత ముంబయి, చెన్నై, హైదరాబాద్ లో న్యాయవాదిగా పనిచేయడం, హైదరాబాద్ హై కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం వంటి విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాలా? వద్దా? అనే ప్రశ్నలతో నాలో నేనే పలు సందర్భాల్లో తర్జన భర్జన అయ్యాను. పలు దఫాలుగా నాలోనేనే చర్చించుకున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే న్యాయస్థానంలో నా ప్రస్థానం గురించి చెప్పాలన్నప్పుడు న్యాయవాద వృత్తిలో నా అనుభవాలు కూడా ప్రస్తావించాలా? ఆ అనుభవాలు, ఆ తర్వాత హై కోర్ట్ జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నా జ్ఞాపకాలలో నా న్యాయవాద వృత్తి అనుభవాలు కూడా చేర్చాలా? వద్దా అని కూడా తర్కించుకున్నాను. న్యాయవాద వృత్తి కూడా న్యాయ వ్యవస్థలో భాగమే అనడంలో నాకెలాంటి సందేహం లేదు. న్యాయమూర్తులు కోర్టులో న్యాయనిర్ణేత స్థానంలో కూర్చున్నట్టీ న్యాయవాదులు కూడా ఆ న్యాయస్థానాల్లో భాగస్వాములే అని నా ప్రగాఢ విశ్వాసం. గతంలో నేను రాసిన The Revolutions I Have Lived Through అనే నా స్వీయ చరిత్రలో నా న్యాయవాద విద్యాభ్యాసం నుండి న్యాయవాద వృత్తి, న్యాయమూర్తి పదవి వరకూ అనేక విషయాలు ప్రస్తావించాను కాబట్టి ఇప్పుడు మరోసారి ఆ విషయాలన్నీ ప్రస్తావించడం పునశ్చరణం అవుతుందేమో అనే సందిగ్ధం కలిగింది. గతంలో చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో మళ్ళీ వివరించాల్సి వస్తే అదో పెద్ద గ్రంధమే అవుతుంది అని అలోచించి, ఈ పుస్తకాన్ని కొంతమేరకు పరిమితం చేశాను. పూర్తివివరాలు కావాలనుకునే పాఠకులు ఇంతకుముందు నేను రాసిన పుస్తకం చదివితే సరిపోతుంది అని అనుకుని ఈ పుస్తకాన్ని గతంలో ఎక్కడ ముగించానో అక్కడినుండి ప్రారంభించాలని నిర్ణయించాను. అయితే నా మునుపటి పుస్తకంలో....................© 2017,www.logili.com All Rights Reserved.