పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు
పట్టినేని బిగియ పట్టవలయు
పట్టి విడుటకంటే పడిచచ్చుటే మేలు
ఉర్వివారి కెల్ల నొక్క కంచము బెట్టి
పొత్తుకుడిపి కులము పాలియజేసి
తలను చెయ్యిబెట్టి తగనమ్మ జెప్పరా
కస్తురి వలపేల గజరాజమున కెన్న
తనదు మదపుధార తావిగాగ
యోగి కేల రంభ యోగహర్షం బుండ
చదువు లందు పాడిమొదవు లందున,స్త్త్రిల
పెదవు లందు,రాజపదవు లందు
ఆశ లుడిగినట్టి అయ్యలు ముక్తులు
విశ్వధాభిరామ వినుర వేమ.
ఇది సిద్దాంత గ్రంధం కాదు, సరదా సాహిత్యం కాదు. ఈ పుస్తకానికి ప్రణాళిక నేను రూపొందించలేదు,దీని
తత్త్వాని వేమన నుంచి గ్రహించాను. ఏ విచారధారకేసి మొగ్గకుoడా, ధీరంగా, స్వతంత్రంగా ,మూలాన్ని అన్వేషించడం
వేమనతత్వం. దాన్ని అనుసరించడానికి ప్రయత్నించాను ."పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా"అని ఆయన ఒక్క
ఆటవెలది పాదంలో సంప్రదాయాన్ని తలక్రిందులు చేస్త్హాడు.ఇలా ఆ తాత్త్వికుడు ఎందుకు చెప్పాడని ఆ మూలాన్ని
పట్టుకునే ప్రయత్నం నేను చేశాను."హింస నెంచి చూడ ఇష్టమెట్లాయెనొ" అని మహాభారతంలోని హింసాధర్మాన్ని
ప్రశ్నిస్తాడు. ఆయన ఏ కోణం నుంచి చూశాడని నేను అన్వేషించాను. వందల కొద్ది వున్నా వేమన పద్యాల ఒక
తొంబది ఎంచి మూలాన్ని అన్వేషించే, విశ్లేషించే ప్రయత్నం చేశాను.
- జి.వి. సుబ్రహ్మణ్యం
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు పట్టినేని బిగియ పట్టవలయు పట్టి విడుటకంటే పడిచచ్చుటే మేలు ఉర్వివారి కెల్ల నొక్క కంచము బెట్టి పొత్తుకుడిపి కులము పాలియజేసి తలను చెయ్యిబెట్టి తగనమ్మ జెప్పరా కస్తురి వలపేల గజరాజమున కెన్న తనదు మదపుధార తావిగాగ యోగి కేల రంభ యోగహర్షం బుండ చదువు లందు పాడిమొదవు లందున,స్త్త్రిల పెదవు లందు,రాజపదవు లందు ఆశ లుడిగినట్టి అయ్యలు ముక్తులు విశ్వధాభిరామ వినుర వేమ. ఇది సిద్దాంత గ్రంధం కాదు, సరదా సాహిత్యం కాదు. ఈ పుస్తకానికి ప్రణాళిక నేను రూపొందించలేదు,దీని తత్త్వాని వేమన నుంచి గ్రహించాను. ఏ విచారధారకేసి మొగ్గకుoడా, ధీరంగా, స్వతంత్రంగా ,మూలాన్ని అన్వేషించడం వేమనతత్వం. దాన్ని అనుసరించడానికి ప్రయత్నించాను ."పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా"అని ఆయన ఒక్క ఆటవెలది పాదంలో సంప్రదాయాన్ని తలక్రిందులు చేస్త్హాడు.ఇలా ఆ తాత్త్వికుడు ఎందుకు చెప్పాడని ఆ మూలాన్ని పట్టుకునే ప్రయత్నం నేను చేశాను."హింస నెంచి చూడ ఇష్టమెట్లాయెనొ" అని మహాభారతంలోని హింసాధర్మాన్ని ప్రశ్నిస్తాడు. ఆయన ఏ కోణం నుంచి చూశాడని నేను అన్వేషించాను. వందల కొద్ది వున్నా వేమన పద్యాల ఒక తొంబది ఎంచి మూలాన్ని అన్వేషించే, విశ్లేషించే ప్రయత్నం చేశాను. - జి.వి. సుబ్రహ్మణ్యం
© 2017,www.logili.com All Rights Reserved.