Shathakamulu (Vemana, Sumathi, Bhaskara, Krishna)

By P V K Prasad Rao (Author)
Rs.150
Rs.150

Shathakamulu (Vemana, Sumathi, Bhaskara, Krishna)
INR
EMESCO0341
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Shathakamulu (dasaradhi, Sri Kalahasthiswara, Narayana) Rs.150 In Stock
Check for shipping and cod pincode

Description

         శతము అనగా నూరు. శతకము అనగా నూరు పద్యములుగల గ్రంథము. 'శతకము సర్వజనాదరణీయమైన శక్తి వంతమైన ప్రక్రియ' సంస్కృత వాజ్మయము నుండి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియలలో శతక రచన ఒకటి. 'సంస్కృత ప్రాకృత భాషలలోని శతకమే తెలుగులో కొన్ని విశిష్టతలతో అవతరించింది. కాని కొందరు విమర్శకులు ఊహించినట్లు శతకము దేశ కవితలకు పూచినా పువ్వుకాదు' అని డాక్టరు కె. గోపాలకృష్ణారావుగారు తన 'ఆంద్ర శతక సాహిత్య వికాసము' అను పరిశోధన గ్రంథములో సప్రమాణముగా నిరూపించినారు. తెలుగులో శతక రచన క్రీ. శ. 12వ శతాబ్దమునుండి నేటి వరకు అవిచ్చిన్నముగా కొనసాగుచున్న సాహిత్య ప్రక్రియ.

           బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి భోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, నరసింహశతకము వంటి పెద్ద శతకాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవారు. నేటి కాలంలో శతక పఠనం పాఠశాలలో కేవలం తెలుగు పాఠ్య గ్రంథాలలోని కొన్ని పద్యాలకే పరిమితమై పోయింది.

          శతకపఠనం వల్ల బాలబాలికలలో జ్ఞాపకశక్తి, ధారాశుద్ధి, భాషా సంపద, భావనా శబలత, మనోవికాసము, లోకానుభావము, దైవ చింతన వృద్ధి పొందుతాయి. సుప్రసిద్ధములైన తెలుగు శతకాలను బాలబాలికలచేత పఠింపజేసి వారిని స్వభాషా, సంస్కృతీ సంప్రదాయ నిష్టులుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు ధార్మిక సంస్థలు, సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, అవిరాళంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ కృషిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా బహుళ ప్రచారం పొందిన భక్తి శతకాలను, నీతి శతకాలను టీకా తాత్పర్య సహితంగా ప్రచురించి సాధ్యమైనంత తక్కువ వెలకు విద్యార్థి లోకానికి అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించిందే ఈ శతక సాహిత్యమాల.

         శతము అనగా నూరు. శతకము అనగా నూరు పద్యములుగల గ్రంథము. 'శతకము సర్వజనాదరణీయమైన శక్తి వంతమైన ప్రక్రియ' సంస్కృత వాజ్మయము నుండి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియలలో శతక రచన ఒకటి. 'సంస్కృత ప్రాకృత భాషలలోని శతకమే తెలుగులో కొన్ని విశిష్టతలతో అవతరించింది. కాని కొందరు విమర్శకులు ఊహించినట్లు శతకము దేశ కవితలకు పూచినా పువ్వుకాదు' అని డాక్టరు కె. గోపాలకృష్ణారావుగారు తన 'ఆంద్ర శతక సాహిత్య వికాసము' అను పరిశోధన గ్రంథములో సప్రమాణముగా నిరూపించినారు. తెలుగులో శతక రచన క్రీ. శ. 12వ శతాబ్దమునుండి నేటి వరకు అవిచ్చిన్నముగా కొనసాగుచున్న సాహిత్య ప్రక్రియ.            బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి భోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, నరసింహశతకము వంటి పెద్ద శతకాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవారు. నేటి కాలంలో శతక పఠనం పాఠశాలలో కేవలం తెలుగు పాఠ్య గ్రంథాలలోని కొన్ని పద్యాలకే పరిమితమై పోయింది.           శతకపఠనం వల్ల బాలబాలికలలో జ్ఞాపకశక్తి, ధారాశుద్ధి, భాషా సంపద, భావనా శబలత, మనోవికాసము, లోకానుభావము, దైవ చింతన వృద్ధి పొందుతాయి. సుప్రసిద్ధములైన తెలుగు శతకాలను బాలబాలికలచేత పఠింపజేసి వారిని స్వభాషా, సంస్కృతీ సంప్రదాయ నిష్టులుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇందుకు ధార్మిక సంస్థలు, సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, అవిరాళంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ కృషిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా బహుళ ప్రచారం పొందిన భక్తి శతకాలను, నీతి శతకాలను టీకా తాత్పర్య సహితంగా ప్రచురించి సాధ్యమైనంత తక్కువ వెలకు విద్యార్థి లోకానికి అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించిందే ఈ శతక సాహిత్యమాల.

Features

  • : Shathakamulu (Vemana, Sumathi, Bhaskara, Krishna)
  • : P V K Prasad Rao
  • : sahithi prachuranalu
  • : EMESCO0341
  • : Paperback
  • : 2015
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shathakamulu (Vemana, Sumathi, Bhaskara, Krishna)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam