శక్తివంతుడైన కవి కలం-శబ్దాల చేత ఆడిస్తుంది. పాడిస్తుంది. హృదయాన్ని చుబింపజేస్తుంది. లోకాన్ని స్తంబిపజేస్తుంది. కన్నీరు కార్పిస్తుంది. రక్తం కురిపిస్తుంది. కవి కలం చేయలేనిది లేదు. శబ్దం దశాబ్దాలకు శక్తిని కోల్పోదు.
పల్లా దుర్గయ్యగారు తను చిరస్మరణియ కావ్యం 'గంగిరెద్దు' ప్రచిరించి రెండు దశాబ్దాలు దాటినా ఈనాడు మళ్ళి చదువుతుంటే వాస్తవ చిత్రాలు, చక్కని నుడికారాలు, సహజ గంభీరమైన పద్యశైలి పాఠకులను యథాప్రకారం చకితులను చేస్తుంది. కరుణ రసం కట్టలు తెంచుకుని ప్రవహించే కావ్యం "గంగిరెద్దు" నిరుపేదల యెడల నోరులేని పశువుల యెడ కవి సానుభూతి అడుగడుగునా కనిపిస్తుంది.
"ఉన్నవానికి మణులను నుప్పురాళ్ళే
లేనివానికి రాలును మానికములే
అధికునకు గొంచె మగును కొండంత కీడు
కొంచె గానికి గోరంత కొండలగును."
అవలక్షణాలతో పుట్టిన కోడెకు కావ్య నాయకత్వము కట్టపెట్టగల సాహసము దుర్గయ్య గారికే దక్కినది.
"ఆపుకొన్నను నాగోవు నప్పుక్రింద
కరణమే మేలు చూడ ఓ కాడికింక
బమ్మయట ఎవ్వడో వాని జిమ్మదరుగ
కటిక వానికి కొంత అక్కటిక ముండు"
అని విధిని నిందిస్తాడు కాపు. అతని దృష్టిలో బ్రహ్మ కన్నా కరణమే కాస్త నయం కానీ నిజానికి ఇద్దరూ దయరహితులే నా దృష్టిలో...........
-కళా ప్రపూర్ణ దాశరధి.
శక్తివంతుడైన కవి కలం-శబ్దాల చేత ఆడిస్తుంది. పాడిస్తుంది. హృదయాన్ని చుబింపజేస్తుంది. లోకాన్ని స్తంబిపజేస్తుంది. కన్నీరు కార్పిస్తుంది. రక్తం కురిపిస్తుంది. కవి కలం చేయలేనిది లేదు. శబ్దం దశాబ్దాలకు శక్తిని కోల్పోదు. పల్లా దుర్గయ్యగారు తను చిరస్మరణియ కావ్యం 'గంగిరెద్దు' ప్రచిరించి రెండు దశాబ్దాలు దాటినా ఈనాడు మళ్ళి చదువుతుంటే వాస్తవ చిత్రాలు, చక్కని నుడికారాలు, సహజ గంభీరమైన పద్యశైలి పాఠకులను యథాప్రకారం చకితులను చేస్తుంది. కరుణ రసం కట్టలు తెంచుకుని ప్రవహించే కావ్యం "గంగిరెద్దు" నిరుపేదల యెడల నోరులేని పశువుల యెడ కవి సానుభూతి అడుగడుగునా కనిపిస్తుంది. "ఉన్నవానికి మణులను నుప్పురాళ్ళే లేనివానికి రాలును మానికములే అధికునకు గొంచె మగును కొండంత కీడు కొంచె గానికి గోరంత కొండలగును." అవలక్షణాలతో పుట్టిన కోడెకు కావ్య నాయకత్వము కట్టపెట్టగల సాహసము దుర్గయ్య గారికే దక్కినది. "ఆపుకొన్నను నాగోవు నప్పుక్రింద కరణమే మేలు చూడ ఓ కాడికింక బమ్మయట ఎవ్వడో వాని జిమ్మదరుగ కటిక వానికి కొంత అక్కటిక ముండు" అని విధిని నిందిస్తాడు కాపు. అతని దృష్టిలో బ్రహ్మ కన్నా కరణమే కాస్త నయం కానీ నిజానికి ఇద్దరూ దయరహితులే నా దృష్టిలో........... -కళా ప్రపూర్ణ దాశరధి.© 2017,www.logili.com All Rights Reserved.